Telangana | అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు.. ఓటింగ్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రారంభం

Telangana | విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కసరత్తును ఆరంభించింది. జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవల్ చెకింగ్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఇంజనీర్ల బృందాలు సోమవారం ప్రారంభించాయి. వారం రోజుల పాటు తనిఖీ ప్రక్రియను నిర్వహించనున్నాయి. కలెక్టర్లు అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియలో భాగస్వామ్యంగా ఉండనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 1014 బ్యాలెట్ యూనిట్లు, 793 […]

Telangana | అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు.. ఓటింగ్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రారంభం

Telangana |

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కసరత్తును ఆరంభించింది. జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవల్ చెకింగ్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఇంజనీర్ల బృందాలు సోమవారం ప్రారంభించాయి.

వారం రోజుల పాటు తనిఖీ ప్రక్రియను నిర్వహించనున్నాయి. కలెక్టర్లు అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియలో భాగస్వామ్యంగా ఉండనున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 1014 బ్యాలెట్ యూనిట్లు, 793 కంట్రోల్ యూనిట్లు, 856 వివి పాట్స్ యూనిట్లు, మొత్తం 2,663 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సోమవారం నుంచి శనివారం వరకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహించనున్నారు.

ఈవీఎంల తనిఖీ ప్రక్రియను సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలాసత్పతి పరిశీలించారు. అన్ని జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ స్పెషల్ డ్రైవ్ వారం పాటు కొనసాగనుంది.