Telangana student dies| జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్‌రెడ్డి జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయాడు.
విధాత : ఉన్నత చదువులు..ఉత్తమ సంపాదనపై ఎన్నో ఆశలతో విదేశాలకు వెలుతున్న భారతీయ విద్యార్థులు అక్కడ ఏవో ప్రమాదాలతో మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా జర్మనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం(Telangana student dies) చెందాడు. జనగామ జిల్లా( Jangama district) చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్‌రెడ్డి (Hrithik Reddy) జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయాడు.
హృతిక్ రెడ్డి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో భవనం నుంచి కిందికి దూకేశాడు. దీంతో హృతిక్ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చేర్చినప్పటికి పరిస్థితి విషమించి మృతిచెందినట్లుగా సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram