ఈటలకు అస్వస్థత.. ప్రజాదీవెనయాత్ర కు తాత్కాలిక విరామం
విధాత:ఈటల రాజేందర్ ప్రజాదీవెనయాత్ర కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈరోజు యాత్ర 12 వ రోజులో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న తరువాత ఈటల అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా బీపీ 90/60, సుగర్ లెవెల్ 265 గా నమోదు అయ్యింది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపివేసి హైదరాబాద్ తీసుకొని వెళ్ళాలి అని డాక్టర్స్ సలహా ఇవ్వడంతో […]

విధాత:ఈటల రాజేందర్ ప్రజాదీవెనయాత్ర కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈరోజు యాత్ర 12 వ రోజులో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న తరువాత ఈటల అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా బీపీ 90/60, సుగర్ లెవెల్ 265 గా నమోదు అయ్యింది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపివేసి హైదరాబాద్ తీసుకొని వెళ్ళాలి అని డాక్టర్స్ సలహా ఇవ్వడంతో ఈటల ను హైదరాబాద్ కి తరలించారు.
ఈ నెల 19 వ తేదీన మొదలైన ప్రజా దీవెన యాత్ర ఈరోజుకి 12 వ రోజు. ఇప్పటి వరకు 70 గ్రామాల్లో 222 కిలోమీటర్లు పూర్తి అయ్యింది.ప్రజాదీవెన పాదయాత్ర లో స్వల్ప అస్వస్థతకు గురైన మాజీమంత్రి ఈటల రాజేందర్ ను ఫోన్ ద్వారా పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.డాక్టర్ల వైద్య పరీక్షల వివరాలను ఈటలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్.ఆరోగ్యం మెరుగయ్యేదాకా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని ఈటల రాజేందర్ కు సూచించిన బండి సంజయ్.