ప్రజాపాలన సభలో మైక్ ని నేలకేసి కొట్టిన కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక ప్రజాపాలన సభలో మైక్ కట్ చేయడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మైక్ నేలకేసి కొట్టి నిరసన వ్యక్తం చేశారు. సభలో ఉద్రిక్తత నెలకొంది.

దుబ్బాక ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా అధికారులు మైకులు కట్ చేయడం రభసకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా మైకులు కట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరును నిరసిస్తూ చేతులోని మైక్ లను నేలకేసి కొట్టారు.

సభా వేదిక దిగి నేలపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు.ఆయనకు మద్దతుగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలకు దిగాయి. దీంతో పోటీగా కాంగ్రెస్ వర్గీయులు కూడా నినాలు చేయడంలో సభా ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఆ తర్వాతా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాపాలన కార్యక్రమాన్ని బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి :

సర్వోదయ తెలంగాణ సాధనకే పాంచజన్యం : కవిత
పాపం.. పుచ్చకాయ అమాయకురాలు.. ముంబై కుటుంబాన్ని చంపింది విష ప్రయోగం?

Latest News