Dubbaka fake currency| దుబ్బాకలో దొంగ నోట్ల కలకలం

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఒకే నంబర్‌తో కూడిన రూ.200 నోట్లు ప్రత్యక్షం కావడంతో దొంగనోట్ల వ్యవహారం వెలుగు చూసింది. కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్ గా దొంగనోట్లను చలామణి చేస్తున్నారని..దొంగనోట్ల ముఠా కొంత కాలంగా నకిలీ నోట్ల చలామణి చేస్తుందని వెల్లడైంది.

Dubbaka fake currency| దుబ్బాకలో దొంగ నోట్ల కలకలం

విధాత : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగనోట్ల(Dubbaka fake Rs 200 currency) చలామణి వ్యవహారం కలకలం రేపింది. ఒకే నంబర్‌తో కూడిన రూ.200 నోట్లు ప్రత్యక్షం కావడంతో దొంగనోట్ల వ్యవహారం వెలుగు చూసింది. కూరగాయలు అమ్మే వృద్దులే (vegetable vendors) టార్గెట్ గా దొంగనోట్లను చలామణి చేస్తున్నారని..దొంగనోట్ల ముఠా కొంత కాలంగా నకిలీ నోట్ల చలామణి చేస్తుందని వెల్లడైంది. రూ.200 నకిలీ కరెన్సీ విషయమై పోలీసులు దర్యాప్తు( police investigation) చేపట్టారు. వాటికి ఇంకా ఎవరెవరికి ఇచ్చారు..ఎక్కడెక్కడా చలామణి చేశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

అసలు నోటును గుర్తించడం ఎలా ?

రూ. 200 ఒరిజినల్ నోటు సైజు 66ఎఎంఎక్స్ 146ఎంఎంలో ఉంటుంది. నోటుపై మహాత్మా గాంధీ చిత్రానికి ఎడమవైపున దేవనాగరి లిపిలో నిలువుగా రూ. 200 అని రాసి ఉంటుంది. దాని కింద బయటకు కనిపించకుండా 200 అని రాసి ఉంటుంది. మైక్రో లెటర్స్ లో ఆర్బీఐ, భారత్, ఇండియా అని ఉంటుంది. గాంధీ చిత్రం పక్కన నిలువుగా ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్‌లో ఉండి నోటును అటుఇటు కదిపితే బ్లూ కలర్‌లోకి మారుతుంది. దీన్ని టచ్ చేసినప్పుడు వేళ్లకు తగులుతుంది. అలా తగలకపోతే అదిఫేక్ నోట్ అని గుర్తించాలి. గాంధీ చిత్రానికి కుడి వైపున ఆర్బీఐ సింబల్, గవర్నర్ సంతకం దానిపైన ప్రామిస్ క్లాజ్ ఉంటుంది. నోటుపై ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీ చిత్రం, ఎలక్ట్రోటైప్‌లో రూ. 200 వాటర్ మార్క్ ఉంటుంది. కుడివైపు దిగువన రూ. 200 నంబర్ కింద నంబర్ ప్యానెల్ ఉంటుంది. కుడి వైపు చివరన అశోక స్తంభం ఉంటుంది. నోటు చివర్లో రెండు, రెండు చొప్పున అడ్డగీతలు ఉంటాయి. నోటుకు వెనకవైపు నోటు ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ్ భారత్ లోగో, లాంగ్వేజ్ ప్యానెల్, సాంఛీ స్థూపం, చివరగా దేవనాగరి లిపిలో రూ. 200 అని ఉంటుంది.