బీజేపీ నేత రఘునందన్‌రావుపై కేసు నమోదు

బీజేపీ నేత రఘునందన్‌రావుపై కేసు నమోదు

విధాత, హైదరాబాద్‌ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుపైన, మెదక్ బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు, ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి జి. రఘునందన్ రావు పై సంగారెడ్డి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన సహా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చింతా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు రఘునందన్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డిల పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.