TG Polycet | మే 27 నుంచి టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇదే..!
TG Polycet | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ప్రతి ఏడాది టీజీ పాలిసెట్( TG Polycet ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
TG Polycet | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ప్రతి ఏడాది టీజీ పాలిసెట్( TG Polycet ) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 26 లోపు పాలిసెట్ ఫలితాలు( Polycet Results ) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మే 27 నుంచి పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్( Polycet First Phase counselling ) ను ప్రారంభించనున్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
- మే 27 నుంచి 31 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
- 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
- 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- జూన్ 6న సీట్ల కేటాయింపు
- జూన్ 6 నుంచి 9 వరకు ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్
- 8, 9 తేదీల్లో సీటు పొందిన కళాశాలలో రిపోర్టింగ్
- 9న విద్యా సంవత్సరం ప్రారంభం
చివరి విడుత షెడ్యూల్ ఇలా..
- జూన్ 15 నుంచి 16 వరకు స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్
- 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు
- జూన్ 20 లోపు సీట్ల కేటాయింపు
- జూన్ 20 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్
- 22, 23 తేదీల్లో సీటు పొందిన కళాశాలలో రిపోర్టింగ్
జూన్ 27 నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్‌కు అవకాశం
జూన్ 27 నుంచి 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహిస్తారు. అంటే అప్పటికే సీటు పొందిన కళాశాలల్లో ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారొచ్చు. స్పాట్ ప్రవేశాలను జులై 1 నుంచి 8 తేదీల మధ్య పూర్తిచేసుకోవాలని నిర్దేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram