Kaleshwaram | కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ.. విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరు

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ విచారణ కొనసాగుతున్నది. సోమవారం కమిషన్ ఎదుట విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరయ్యారు.

  • By: Somu |    telangana |    Published on : Aug 19, 2024 5:20 PM IST
Kaleshwaram | కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ.. విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరు

Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ విచారణ కొనసాగుతున్నది. సోమవారం కమిషన్ ఎదుట విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. విజిలెన్స్ మధ్యంతర నివేదిక సమర్పించనున్న క్రమంలోజస్టిస్ పీసీ ఘోష్‌కు కాళేశ్వరం అనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విచారణ అంశాలను ఆనంద్ వివరించారు.

ఈ సందర్భంగా విచారణకు సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్న పీసీ ఘోష్ (Justice PC Ghosh)అదనపు సమాచారంతో నివేదిక త్వరగా ఇవ్వాలని ఆనంద్‌ను ఆదేశించారు. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన కమిషన్ త్వరలోనే గత ప్రభుత్వంలోని పెద్దలను విచారించేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో విజిలెన్స్ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే బుధవారం నుంచి జస్టిస్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనున్నది. బుధవారం మాజీ ఈఎన్సీ మురళీధర్ ను ప్రశ్నించనున్నది. ఇదివరకే అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని విచారించేందుకు సిద్ధం అవుతుంది.