కెసిఆర్ పోరాట ఫలితమే తెలంగాణ :మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

అన్ని వర్గాలను ఓకే వేదిక పై తెచ్చి తెలంగాణ స్వ రాష్ట్ర సాధన కోసం తెగించి పోరాడిన కెసిఆర్ ఆనవాళ్లను చేరిపేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు

కెసిఆర్ పోరాట ఫలితమే తెలంగాణ :మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

విధాత, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………….
అన్ని వర్గాలను ఓకే వేదిక పై తెచ్చి తెలంగాణ స్వ రాష్ట్ర సాధన కోసం తెగించి పోరాడిన కెసిఆర్ ఆనవాళ్లను చేరిపేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.కెసిఆర్ తోనే తెలంగాణ సాధ్యమైందని, ఆయన చేసిన పోరాటం వల్లే అన్ని పార్టీలు ముందు వచ్చి మద్దతు ఇచ్చారన్నారు.
కేసీఆర్ ను తక్కువ చేసి చూపించాలనే కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం సరికాదన్నారు.సాధించిన తెలంగాణ రాష్ట్రం లో పదేళ్లల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కెసిఆర్ ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కెసిఆర్ పాలనా సాగిందని, ఇంటింటికి నల్ల ఇచ్చి తాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.రైతులకు పెట్టుబడి సాయం, నాణ్యమైన కరెంటు, పండించిన పంటను కొనుగోలు చేసి అన్ని రంగాల్లో రైతులనుఆదుకున్నామ్మన్నారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో విత్తనాల కోసం రైతులు ఎప్పుడు చెప్పులు క్యూ లైన్లో పెట్టలేదని మాజీ మంత్రి గుర్తు చేశారు.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని,
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలని మోసం చేస్తోందన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను 80 శాతం పూర్తి చేసామని, మిగిలిన పనులు పూర్తి చేసి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించిందుకు రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుంచి బయలుదేరి అమరవీరుల స్తూపం (గన్ పార్క్) వద్ద ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో ఘన నివాళి అర్పించడం జరుగుతుందన్నారు. రెండవ తేదీన ఉదయం 9గంటలకు తెలంగాణ భవన్ లో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కెసిఆర్ ఆధ్వర్యంలో సభ ఉంటుందని పేర్కొన్నారు. మూడో తేదీన జిల్లా పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు.ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పదేళ్ల అధికారం లో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీయించారని తెలిపారు.
2014 కంటే ముందు తెలంగాణ, ఆ తరువాత తెలంగాణను ఒకసారి ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ లు గణేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, రామకృష్ణ, పాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
………………………..