Peddi Sudarshan Reddy | రాష్ట్రంలో పెరిగిన హత్యలు, అత్యాచారాలు ,పెడదోవపడుతున్న యువత : పెద్ది సుదర్శన్ రెడ్డి

రాష్ట్రం, జిల్లాలో హత్యలు , అత్యాచారాలు, పోలీస్ వేధింపులు అధికమయ్యాయనీ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దారుణ సంఘటనలు జరుగుతున్నా రాష్ట్రానికి హోమ్ మంత్రి లేకపోడం దురదృష్టం.

Peddi Sudarshan Reddy | రాష్ట్రంలో పెరిగిన హత్యలు, అత్యాచారాలు ,పెడదోవపడుతున్న యువత : పెద్ది సుదర్శన్ రెడ్డి

రాష్ట్రంలో పెరిగిన హత్యలు, అత్యాచారాలు

పెడదోవపడుతున్న యువత

ఎమ్మెల్యే కడియం పై విమర్శలు

—- బీఆరెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రతినిధి:

రాష్ట్రం, జిల్లాలో హత్యలు , అత్యాచారాలు, పోలీస్ వేధింపులు అధికమయ్యాయనీ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దారుణ సంఘటనలు జరుగుతున్నా రాష్ట్రానికి హోమ్ మంత్రి లేకపోడం దురదృష్టం. సీఎం రేవంత్ రెడ్డి నే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్ది మాట్లాడారు.

యువత పెడదోవ పడుతున్నారనీ చెన్నారావుపేట మండలంలో నిన్నటి 16 చింతల తండా ఉదంతం దారుణమన్నారు. పోలీస్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులకు రెండు మూడు సార్లు పోస్టింగులు ఇస్తూ వాళ్ళని మారుస్తారా? అంటూ ప్రశ్నించారు. జిల్లాలో ఎస్ఐ పోస్టింగుకి ఇంత సీఐ పోస్టింగుకి ఇంత డీఎస్పీ పోస్టింగుకి ఇంత అని ఎమ్మెల్యేలు అడుగుతుంటే ఇలాంటి సంఘటనలే జరుగుతాయన్నారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవడానికి ప్రధాన కారణం కొంతమంది అసమర్ధ పోలీస్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వడమేనని విమర్శించారు.

– ఎమ్మెల్యే కడియం పై సెటైర్లు

కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో సురేఖ , సీతక్క మంత్రులుగా 10 మంది ఎమ్మెల్యేలు వున్నారు…కానీ ఆ 11 నెంబర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి ప్రవర్తన వేరేగా ఉన్నదని ఎద్దేవా చేశారు. 1600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కెసిఆర్ ప్రభుత్వం వున్నప్పుడు తీసుకొచ్చామన్నారు. టెండర్ అయిన పనులను ఆపివేస్తున్నారు..టెండర్ కానీ పనులను రద్దు చేస్తున్నారు. మా పార్టీ నాయకుల పైన కేసులు,మా పార్టీ నాయకులను లాక్కోవడం ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. ఇక నుండి ప్రతీ గ్రామంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై రోజుకొక సోషల్ మీడియా పోస్ట్ పెడతాము… నేడు రౌడీ షీటర్స్ ఖద్దరు చొక్కాలు ధరించారనీ ఇదే వరంగల్లో వచ్చిన మార్పని అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి మయం అయితే కడియం శ్రీహరి కూడా అవినీతిలో ఉన్నట్టేనని అన్నారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయను అని కడియం శ్రీహరి అన్నాడు…మొన్నటి ఎంపీ ఎన్నికల్లో తన బిడ్డకు ఓటు వేయనట్లున్నాడంటూ హేళన చేశారు.

*