విధాత:కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు.గోదావరి కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి విస్త్రుతంగా సమావేశం చర్చించింది.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం,తెలంగాణ వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని,అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సిఎం మరోసారి స్పష్టం చేశారు. బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరిగి ఇదే అంశం పై ఆదివారం చర్చను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు,ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్,ఈఎన్సీ మురళీధర్, హరిరామ్, సిఎం వోఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే,మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్ కుమార్, ఎస్ ఈ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
నీటి విషయంలో తగ్గేదే లేదు.. సీఎం KCR
<p>విధాత:కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను […]</p>
Latest News

ప్రపంచ కప్ హీరో ఇషాన్ కిషన్ ప్రియురాలు ఎవరో తెలుసా?
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రిద్ధి కుమార్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
ఆస్ట్రేలియా ఔట్! – భారత్ సూపర్-8 ప్రత్యర్థులు ఖరారు
జటిలంగా తెలంగాణ అక్రెడిటేషన్ అప్లికేషన్ మాడ్యుల్.. అరిగోస పడుతున్న జర్నలిస్టులు
120 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న రైలుపై విమానం ల్యాండింగ్
నటి వాష్‌రూమ్‌లో ఉండగా.. సీక్రెట్‌గా వీడియో తీసి బ్లాక్మెయిల్
ముంబై వాసులను సర్ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్
మూడు పెళ్లిళ్ల ఐఏఎస్ అధికారి..ముగ్గురు భార్యలు ఐఏఎస్ లే !