కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ యూనివర్సిటీ వీసీ టి.రమేష్ పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కాకతీయ యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధ్యాపకుల తొలగింపు
విధాత : కాకతీయ యూనివర్సిటీ వీసీ టి.రమేష్ పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కాకతీయ యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధ్యాపకుల తొలగింపు, అక్రమ బదిలీలు, పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలు వంటి ఆరోపణలు రమేష్ ఎదుర్కొంటున్నారు.
యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. రమేష్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రమేష్ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram