కరెంటు బిల్లులు కాదు..కాళేశ్వరం దోపిడి బిల్లులు పంపండి

కరెంటు బిల్లులు సోనియాగాంధీ ఇంటికి పంపాపలన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ట్వీట్టర్ వేదిగా

కరెంటు బిల్లులు కాదు..కాళేశ్వరం దోపిడి బిల్లులు పంపండి
  • కేటీఆర్‌కు విజయశాంతి ఘాటు కౌంటర్‌

విధాత : కరెంటు బిల్లులు సోనియాగాంధీ ఇంటికి పంపాపలన్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ట్వీట్టర్ వేదిగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపించమంటున్న కేటీఆర్.. కాళేశ్వరం దోపిడీ బిల్లులు కేసీఆర్‌ ఇంటికి పంపాలని చెప్పాలని ట్వీట్‌లో డిమాండ్ చేశారు. ఖజానా మొత్తం దోచుకొని బీఆరెస్‌ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిన విషయం పూర్తిగా తెలుసు కాబట్టే కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు జరగవని కేటీఆర్ మాట్లాడుతున్నారని చురకలంటించారు. కష్టమైనా కాంగ్రెస్ అన్ని హామీలు అమలు చేసి తీరుతుందని ట్వీట్‌లో చెప్పారు. ఇప్పటికే జనవరి నెల కరెంటు బిల్లులు కట్టవద్దని, బిల్లులను సోనియాగాంధీ ఇంటికి పంపించాలని కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ప్రతి విమర్శలతో దాడి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు విజయశాంతి సైతం కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.