Wanaparthy : వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ..చిన్నారెడ్డి VS మేఘారెడ్డి

వనపర్తి కాంగ్రెస్‌లో సర్పంచ్ ఎన్నికల సెగ. ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా మారిన రాజకీయం. చిన్నారెడ్డి వెన్నుపోటు వల్లే అభ్యర్థులు ఓడారని ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.

Wanaparthy : వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ..చిన్నారెడ్డి VS మేఘారెడ్డి

విధాత : వనపర్తి కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ ఎన్నికలు రచ్చ రేపాయి. వనపర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన విజయాలు అందుకోకపోవడానికి.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వెన్నుపోటు రాజకీయాలు కారణమని ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన విమర్శలు చేశారు. ఇంటి దొంగల వల్లే వనపర్తిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారని మేఘారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి చిన్నరెడ్డినే కారణం అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయమని ఓటర్లకు, కార్యకర్తలకు చిన్నారెడ్డి ఫోన్ చేసి చెప్పాడని ఆరోపించారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బలపర్చిన అభ్యర్థులను దగ్గరుండి చిన్నారెడ్డి గెలిపించారని మేఘారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని మేఘారెడ్డి తెలిపారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. ఇందులో ఆయనకు వచ్చిన లాభమేంటో ఆయనకే తెలియాలన్నారు. కేవలంపై నాపైన, ఎంపీ మల్లు రవిపైన కోపంతో చిన్నారెడ్డి పార్టీకి చాలా నష్టం చేశారు అని మేఘారెడ్డి విమర్శించారు. చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై అధిష్టానం పెద్దలకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానన్నారు.

ఇవి కూడా చదవండి :

Elephant Performing Aarti To Ganesha : గణేషుడి విగ్రహానికి ఏనుగు హారతి..వైరల్ వీడియో
Tollywood Stars | మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న 2025 .. ఈ ఏడాది తల్లిదండ్రులైన టాలీవుడ్ స్టార్స్ వీరే..