Hyderabad | మరో మహిళతో భర్త.. షాపింగ్‌మాల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

14ఏండ్ల తన వైవాహిక బంధాన్ని..పిల్లలను కాదనుకుని ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని చాటుమాటుగా తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. బేగంపేట మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్‌లో తన ప్రియురాలితో వచ్చిన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య వారిద్దరిని నిలదీసింది

Hyderabad | మరో మహిళతో భర్త.. షాపింగ్‌మాల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

విధాత, హైదరాబాద్: 14ఏండ్ల తన వైవాహిక బంధాన్ని..పిల్లలను కాదనుకుని ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని చాటుమాటుగా తిరుగుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. బేగంపేట మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్‌లో తన ప్రియురాలితో వచ్చిన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య వారిద్దరిని నిలదీసింది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్లస్టర్ మేనేజర్‌గా పనిచేస్తున్నబోనగాని శ్యామ్ సుందర్ ఫ్యాషన్ డిజైన్ చేస్తున్న మహిళను వెంటబెట్టుకుని లైఫ్ స్టైల్ షాపింగ్‌మాల్‌కు వచ్చాడు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న బాధిత మహిళ తన భర్తను, అతనితో ఉన్న మహిళను నిలదీయగా, నీవు ఎవరో తెలియదంటూ భర్త బుకాయించాడు.

కాగా.. తాను కేవలం ఫ్రెండ్‌గా మాత్రమే వచ్చానంటూ ఫ్యాషన్ డిజైనర్ వాదించింది. వారి మధ్య వాగ్వివాదంతో ఇబ్బంది పడిన షాపింగ్ మాల్ యాజమాన్యం మీ వివాదాలు బయట పెట్టుకోండంటూ వారించారు. ఇంతలో బాధిత మహిళ పోలీసులకు ఫోన్ చేయడంతో వారు రంగప్రవేశం చేశారు. ఈ వివాదంపై వివరాలు సేకరిస్తున్నారు.