Congress | రేవంత్ Vs ఉత్తమ్.. కుటుంబానికి ఒకటే సీటు అంశంపై వాగ్వాదం
Congress | వాడివేడిగా ఎన్నికల కమిటీ భేటీ గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. కుటుంబానికి ఒకటే సీటు అనే అంశంపై మహేశ్‌కుమార్‌గౌడ్ లేవనెత్తగా.. ఈ విషయం ఇప్పుడు అవసరం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డు తగిలారని, దీంతో ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది. దరఖాస్తుదారులపై మరోసారి సర్వే నిర్వహించి, ప్రజా మద్దతు ఉన్నవారికి టికెట్‌లు ఇవ్వాలన్న అంశంపై చర్చ జరిగినప్పుడు మాజీ మంత్రి బలరాంనాయక్ సర్వేల ఆధారంగానే టికెట్‌లు ఇచ్చేదైతే దరఖాస్తులు […]

Congress |
వాడివేడిగా ఎన్నికల కమిటీ భేటీ
గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. కుటుంబానికి ఒకటే సీటు అనే అంశంపై మహేశ్‌కుమార్‌గౌడ్ లేవనెత్తగా.. ఈ విషయం ఇప్పుడు అవసరం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డు తగిలారని, దీంతో ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది.
దరఖాస్తుదారులపై మరోసారి సర్వే నిర్వహించి, ప్రజా మద్దతు ఉన్నవారికి టికెట్‌లు ఇవ్వాలన్న అంశంపై చర్చ జరిగినప్పుడు మాజీ మంత్రి బలరాంనాయక్ సర్వేల ఆధారంగానే టికెట్‌లు ఇచ్చేదైతే దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని ప్రశ్నించినట్టు తెలిసింది.
బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలో ముందే చెప్పాలని సీనియర్ నేత వీ హన్మంతరావు డిమాండ్ చేశారని తెలిసింది. అదే సమయంలో ఇన్ని దరఖాస్తులు ఎందుకు వచ్చాయో తేల్చాలని కూడా పట్టుబట్టినట్టు తెలిసింది.