అంబేద్కర్ జ్యోతిర్లింగా రైలు యాత్రపై ఫిర్యాదు

ఐఆర్‌సీటీసీ ఆగాష్టు 16 నుంచి ప్రారంభించనున్న అంబేద్కర్ జ్యోతిర్లింగ దర్శనం యాత్రను నిలిపివేయాలని సామాజిక విశ్లేషకులు డా. సుదర్శన్ బాలబోయిన ఫిర్యాదు చేశారు. ఈ యాత్రలో భాగమైన అంబేద్కర్ జన్మస్థలం, దీక్షా భూమి ప్రదేశాలను తొలగించి తక్షణమే యాత్రకుపెట్టిన పేరును మార్చాలని రైల్వే అధికారులకు, మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.

అంబేద్కర్ జ్యోతిర్లింగా రైలు యాత్రపై ఫిర్యాదు

విధాత, హైదారాబాద్: ఐఆర్‌సీటీసీ ఆగాష్టు 16 నుంచి ప్రారంభించనున్న అంబేద్కర్ జ్యోతిర్లింగ దర్శనం యాత్రను నిలిపివేయాలని సామాజిక విశ్లేషకులు డా. సుదర్శన్ బాలబోయిన ఫిర్యాదు చేశారు. ఈ యాత్రలో భాగమైన అంబేద్కర్ జన్మస్థలం, దీక్షా భూమి ప్రదేశాలను తొలగించి తక్షణమే యాత్రకుపెట్టిన పేరును మార్చాలని రైల్వే అధికారులకు, మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.

ఈ యాత్రపేరు, యాత్రలో కవర్ చేస్తున్న ఐదు జ్యోతిర్లింగాలైన మహా కాళేశ్వర్, ఉజ్జయిన్ ఓంకారేశ్వర్, శ్రీ స్వామి నారాయణ మందిర్, త్రయంభకేశ్వర్, భీమా శంకర్, గ్రిష్నేశ్వర్ జ్యోతిర్లింగాలతోపాటు అంబేద్కర్‌కు సంబంధించిన స్థలాలను చేర్చడం అంబేద్కర్ విధానాలను, సిద్ధాంతాలను అవమానపరచడమేనని సుదర్శన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను రైల్వేశాఖ ప్రోత్సహించడం ఏ మాత్రం సరైన విధానం కాదని విమర్శించారు. ఆయన చేసిన ఫిర్యాదుకు స్పందిచిన రైల్వే శాఖ అధికారులు ఆయనకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తూ.. అంబేద్కర్ జ్యోతిర్లింగా అనే పేరును తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఈ యాత్రను పూర్తిగా నిలిపివేయాలని సుదర్శన్ రైల్వే అధికారులను డిమాండ్ చేశారు.