Telangana Tourism | పర్యాటకులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 2 నుంచి నాగార్జున సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
Telangana Tourism | పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇప్పటికే సోమశిల - శ్రీశైలం( Somasila - Srisailam ) లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాగా, తాజాగా నాగార్జున సాగర్ - శ్రీశైలం( Nagarjuna Sagar - Srisailam ) లాంచీ ప్రయాణ వివరాలను అధికారులు వెల్లడించారు.
Telangana Tourism | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. హైదరాబాద్( Hyderabad )లో ఉండే వారు.. వీకెండ్లో ఎటు వెళ్లాలో అర్థం కాక ఇదే హైదరాబాద్ రహదారులపై చక్కర్లు కొడుతుంటారు. వీకెండ్‌తో పాటు ఏదైనా పండుగ సెలవులు వస్తే లాంగ్ ట్రిప్పులకు ప్లాన్ చేస్తుంటారు. అది కాస్త ఇబ్బంది. కాబట్టి పర్యాటకులకు తెలంగాణ టూరిజం( Telangana Tourism ) శుభవార్త వినిపించింది.
ఇప్పటికే టూరిజం శాఖ సోమశిల – శ్రీశైలం( Somasila – Srisailam ) లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించగా, తాజాగా శనివారం నాగార్జున సాగర్ – శ్రీశైలం( Nagarjuna Sagar – Srisailam ) లాంచీ ప్రయాణం వివరాలను వెల్లడించింది. నవంబర్ 2వ తేదీ నుంచి సాగర్ – శ్రీశైలం( Sagar – Srisailam ) లాంచీ ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ఉంటుందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో ప్రయాణించేందుకు వన్‌వేకు పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 , టూ వేకు(రాను, పోను) పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు రూ. 2400 చొప్పున ఛార్జీ వసూళ్లు చేయనున్నారు.
ఇది కేవలం జర్నీకి సంబంధించిన రుసుము మాత్రమేనని, శ్రీశైలంలో రూమ్, ట్రాన్స్‌పోర్ట్ వంటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడిపిస్తామని పేర్కొన్నారు. వివరాలకు హైదరాబాద్ అధికారుల సెల్‌నంబర్ 9848540371, 98481258720, నాగార్జునసాగర్ అధికారుల నంబర్ 7997951023కు సంప్రదించాలని సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram