• Telugu News
  • /Trending

China Dogs Escape Story : వండర్ స్టోరీ! .. డాగ్ ఎస్కేప్ మిషన్ సక్సెస్!!

దొంగల నుంచి తప్పించుకున్న 7 కుక్కలు 17 కి.మీ ప్రయాణించి యజమాని వద్దకు చేరిన వండర్ స్టోరీ వైరల్. ఐక్యతతో ప్రమాదాన్ని జయించిన అద్భుత ఘటన.

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Mar 24, 2026, 2:10 pm IST
Read Time: 4 mins
China Dogs Escape Story : వండర్ స్టోరీ! .. డాగ్ ఎస్కేప్ మిషన్ సక్సెస్!!

విధాత : తమను దొంగిలించి మటన్ మార్కెట్ లో అమ్మేసేందుకు ప్రయత్నించిన దొంగల ముఠా నుంచి తెలివిగా తప్పించుకుని క్షేమంగా యజమాని వద్దకు చేరిన కుక్కల కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలో జరిగిన డాగ్ ఎస్కేప్ మిషన్ సక్సెస్ స్టోరీ ఆధ్యంతం సినిమా కథలా ఆసక్తికరంగా సాగి సుఖాంతమైంది.

చైనాలోని జిలిన్ ప్రావిన్స్ లో ఓ యజమాని నుంచి 7కుక్కలను దొంగలు చోరీ చేసి వాటిని డాగ్ మీట్ మార్కెట్ లో అమ్మేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారు. పథకం మేరకు దొంగిలించిన 7 కుక్కలను ఓ వాహనంలో మటన్ మార్కెట్ కు తీసుకెలుతున్నారు. మార్గమధ్యలో ఆ కుక్కలు తెలివిగా దొంగలను బురిడి కొట్టించి ధైర్యంగా తప్పించుకున్నాయి. యజమాని ఇల్లు వెతుక్కుంటూ రెండు రోజుల పాటు రోడ్లు, పొలాలు దాటి సుమారు 17 కి.మీ ప్రయాణించాయి. చివరకు తమ యజమాని వద్దకు చేరాయి. దొంగల నుంచి తప్పించుకుని దిక్కుకొకటిగా పరుగు తీయకుండా అన్నీ కలిసి తమ యజమాని వద్దకు హైవేలు, పొలాల గుండా ఉమ్మడిగా పరస్పరం సహకరించుకుంటూ ప్రయాణించాయి.

దొంగల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన జర్మన్ షెఫర్డ్ కుక్క చుట్టూ మిగతా కుక్కలు రక్షణ వలయంలా నిలబడి అవన్ని ఉమ్మడిగా రహదారి వెంట ముందుకు సాగాయి. . డా పాంగ్ అనే కార్గీ కుక్క వాటన్నింటికి లీడర్ గా దారి చూపించగా…కుక్కలు అన్ని కూడా క్షేమంగా తమ యజమాని ఇంటికి చేరాయి. సినిమా కథను తలిపించేలా సాగి ఈ డాగ్ ఎస్కేప్ మిషన్ సక్సెస్ స్టోరీ ఇప్పడు నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కలిసి ఉంటే ఏ విధంగా ప్రమాదాన్ని ఎదురించవచ్చో ఆ కుక్కల కథ నిదర్శనమంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

లొంగిపోనున్న మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు
Cabinet Meeting | తెలంగాణ హేట్ స్పీచ్ తో పాటు పలు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ ఆవరణ లో మంత్రి మండలి భేటీ