Free Finland Trip | ఈ సమ్మర్‌లో ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్లాలని ఉందా.. ఈ గోల్డెన్ ఛాన్స్‌ కోసం ఇలా అప్లై చేసుకోండి!

Free Finland Trip | ఈ సమ్మర్‌లో ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్లాలని ఉందా? హ్యాపీనెస్ రీట్రీట్ పేరుతో ఏడు రోజుల పాటు ఉచితంగా గడిపేందుకు ఆ దేశ పర్యాటక విభాగం విజిట్ ఫిన్లాండ్ బంపరాఫర్ తీసుకొచ్చింది. మరి దీని కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.!

Free Finland Trip | ఈ సమ్మర్‌లో ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్లాలని ఉందా.. ఈ గోల్డెన్ ఛాన్స్‌ కోసం ఇలా అప్లై చేసుకోండి!

Free Finland Trip | ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచింది ఫిన్లాండ్. మరి అక్కడి ప్రజలు ఎందుకు అంత సంతోషంగా ఉంటారు.. దాని వెనుక ఉన్న సీక్రెట్, వారి లైఫ్‌స్టైల్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం ఈ వేసవి కాలంలో ఫ్రీగానే ఫిన్‌లాండ్‌కు వెళ్లి వారి సీక్రెట్‌ను డైరెక్ట్‌గా తెలుసుకోండి. ఇందుకోసం ఆ దేశ పర్యాటక విభాగం విజిట్ ఫిన్లాండ్ (Visit Finland) ప్రత్యేకంగా “హ్యాపీనెస్ రీట్రీట్ (Happiness Retreat)” పేరుతో ఏడు రోజుల పాటు ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తోంది. మరి దీనికోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

విజిట్ ఫిన్లాండ్ బంపరాఫర్

ఐక్యరాజ్యసమితి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ప్రకారం.. హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. వరుసగా ఏడోసారి ఈ రికార్డు సొంతం చేసుకున్న ఫిన్లాండ్ ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి. మంచుతో కప్పబడిన పర్వతాలు, శాంటా క్లాస్ గ్రామం, నార్తర్న్ లైట్స్ అద్భుత దృశ్యాలు, విశాలమైన సరస్సులు.. ఇలా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా యూరప్‌లోనే అతి పెద్ద సరస్సుల ప్రాంతంగా గుర్తించబడిన ఫిన్నిష్ లేక్‌ల్యాండ్ కూడా ఇక్కడే ఉంది. ప్రశాంతత కోరుకునే వారికి ఇది అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రదేశానికి ఫ్రీగా వెళ్లి.. వారి లైఫ్‌స్టైల్‌ను డైరెక్ట్‌గా తెలుసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ప్రకృతితో ఫిన్నిష్ ప్రజలకు ఉన్న అనుబంధం.. ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా వారు ఉండటానికి గల సీక్రెట్స్ అని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆ దేశ పర్యాటక విభాగం విజిట్ ఫిన్లాండ్ ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.

హ్యాపీనెస్ రీట్రీట్ స్కీమ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన పర్యాటకులకు ఏడు రోజుల పాటు ఫిన్లాండ్‌లో ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎంపికైన వారు ఫిన్నిష్ లేక్‌ల్యాండ్ ప్రాంతంలో వారం రోజుల పాటు గడపవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఫిన్లాండ్ ప్రజల జీవనశైలిని మనకు నేర్పిస్తారు. సరస్సు తీరంలోని గుడిసెల్లో నివసించడం, సౌనా స్నానం, బార్బిక్యూ, హైకింగ్, సైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేయిస్తారు.

ఇలా అప్లై చేస్తే చాలు!

ఈ పర్యటనకు ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేయాలనుకునే వారు ముందుగా తమ భాగస్వామితో కలిసి ఒక చిన్న వీడియోను రూపొందించాల్సి ఉంటుంది. ఫిన్లాండ్‌లో వేసవి సెలవులు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మీరు సంతోషాన్ని ఎలా నిర్వచిస్తారు? ఫిన్లాండ్ ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారు వంటి ప్రశ్నలకు ఆ వీడియోలో సమాధానం ఇవ్వాలి. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో పోస్టు చేసి, ఒక వీడియో చాలెంజ్‌ను పూర్తి చేయాలి. అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, మీరు చేసిన వీడియో లింక్‌ను అందులో అటాచ్ చేయాలి.

మార్చి 29నే దరఖాస్తుకు ఫైనల్ డేట్!

భాగస్వామితో వీడియో అనగానే.. కపుల్స్ మాత్రమే వెళ్లాలని అనుకోవచ్చు. కానీ అలాంటి కండీషన్ ఏమీ లేదు. మీ భాగస్వామిగా ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఇలా ఎవరినైనా తమ భాగస్వామిగా ఎంచుకోవాలి. అయితే ఇద్దరూ కనీసం 18 ఏళ్లు నిండి ఉండటం ముఖ్యం. ఇక ఈ దరఖాస్తు చేసుకునేందుకు భారతీయ కాలమానం ప్రకారం మార్చి 29వ తేదీ ఉదయం 3.29 గంటల వరకు అవకాశం ఉంది.

ఫ్రీ టూర్‌లో ఏమేం ఉంటాయి?

ఎంపికైన అభ్యర్థులను జూన్‌లో ఫిన్లాండ్‌కు తీసుకెళ్తారు. ఎంపికైన అదృష్టవంతులకు మీరు ఉండే ప్రాంతం నుంచి ఫిన్లాండ్ వెళ్లేందుకు విమాన టికెట్లు, అక్కడ ఉండేందుకు విలాసవంతమైన వసతిని ఏర్పాటు చేస్తారు. ఏడు రోజుల పాటు రుచికరమైన ఆహారంతో పాటు అక్కడి జీవనశైలిని నేర్చుకునేందుకు శిక్షణ తరగతులు అన్నీ ఉచితంగానే లభిస్తాయి. ఈ పర్యటనలో వ్యక్తిగతంగా కాకుండా మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ప్రపంచంలోనే హ్యాపియెస్ట్ కంట్రీగా పేరుగాంచిన ఫిన్లాండ్‌ ప్రజల లైఫ్‌స్టైల్‌ను దగ్గర నుంచి అనుభవించే అవకాశం ఉచితంగా కల్పిస్తుండటంతో ఈ ఆఫర్‌ ఇప్పుడు పర్యాటకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More:

ఐఆర్‌సీటీసీ హిమాచల్ ట్రిప్.. ఈ సమ్మర్‌లో షిమ్లా, మనాలిలో ఫుల్ చిల్!

47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!