IRCTC Himachal Tour | ఐఆర్‌సీటీసీ హిమాచల్ ట్రిప్.. ఈ సమ్మర్‌లో షిమ్లా, మనాలిలో ఫుల్ చిల్!

IRCTC Himachal Tour | ఈ వేసవి కాలంలో హిమాచల్ అందాలను ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ (Himachal Hills and Valleys) పేరుతో తీసుకొచ్చిన ఈ ట్రావెల్ ప్యాకేజీలో షిమ్లా, మనాలి, చండీగఢ్‌లో ఎంజాయ్ చేసి రావచ్చు.

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 22, 2026, 12:03 am IST
Read Time: 6 mins
IRCTC Himachal Tour | ఐఆర్‌సీటీసీ హిమాచల్ ట్రిప్.. ఈ సమ్మర్‌లో షిమ్లా, మనాలిలో ఫుల్ చిల్!

IRCTC Himachal Tour | ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా? మంచుతో కప్పబడిన కొండలు, పచ్చటి లోయలు, చల్లటి వాతావరణం మధ్య రిలాక్స్ అవ్వాలని ఉందా? ఈ వేసవికాలంలో హిమాచల్ ప్రదేశ్‌ పర్యటనకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హిమాచల్ హిల్స్ అండ్ వ్యాలీస్ (Himachal Hills and Valleys) పేరుతో తీసుకొచ్చిన ఈ ట్రావెల్ ప్యాకేజీలో షిమ్లా, మనాలి, చండీగఢ్‌లో ఎంజాయ్ చేసి రావచ్చు.

హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ మొత్తం ఆరు రోజులు, ఏడు రోజుల పాటు సాగనుంది. మే 1వ తేదీన ఈ ట్రిప్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమై.. షిమ్లా, మనాలి, చండీగఢ్‌ వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చేలా ఈ ట్రిప్‌ను ఐఆర్‌సీటీసీ షెడ్యూల్ చేసింది. హైదరాబాద్ నుంచి విమానం ద్వారా జర్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడకుండా కంఫర్ట్‌గా ట్రిప్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

ప్యాకేజీ ధరలు

హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.61,100 ధరను ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.47వేలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.44,750 చార్జ్ చేయనుంది. ఇక పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.38,850; బెడ్ లేకుండా అయితే రూ.36,850 వసూలు చేయనుంది.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం బయల్దేరి చండీగఢ్ చేరుకుంటారు. అక్కడి నుంచి షిమ్లాకు రోడ్డుమార్గంలో వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత రాత్రికి షిమ్లాలోనే బస చేస్తారు.

రెండో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సైట్ సీయింగ్‌కు వెళ్తారు. కుఫ్రీ, జాకు, హనుమాన్ మందిర్, దర్శించుకుంటారు. సాయంత్రం మాల్ రోడ్డుకు వెళ్తారు. రాత్రికి షిమ్లాలోనే బస చేస్తారు.

మూడో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం మనాలికి బయల్దేరి వెళ్తారు. సాయంత్రం వరకు మనాలి చేరుకుని అక్కడి హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. రాత్రికి మనాలిలోనే బస ఉంటుంది.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం సొలాంగ్ వ్యాలీ సందర్శనకు వెళ్తారు. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్‌ను ఆస్వాదించవచ్చు. సాయంత్రం మాల్ రోడ్డు సందర్శనకు వెళ్లారు. రాత్రికి మనాలీలోనే బస చేస్తారు.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హిడింబ ఆలయం దర్శనానికి వెళ్తారు. అనంతరం అటల్ టెన్నెల్‌తో పాటు ఇతర సందర్శనాత్మక ప్రదేశాలకు వెళ్లొస్తారు. రాత్రికి మనాలిలోనే బస ఉంటుంది.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చండీగఢ్‌కు బయల్దేరి వెళ్తారు. సాయంత్రానికి చండీగఢ్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఏడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం రాక్ గార్డెన్ సందర్శనకు వెళ్లొస్తారు. మధ్యాహ్నం చండీగఢ్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు విమానంలో తిరుగు ప్రయాణమవుతారు.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* విమాన టికెట్లు ( హైదరాబాద్ నుంచి చండీగఢ్ రౌండ్ ట్రిప్)
* బ్రేక్‌ఫాస్ట్‌లు, డిన్నర్‌లతో కలిసి ఆరు రోజుల హోటల్ వసతి
* లోకల్ ట్రాన్స్‌పోర్టుకు ఏసీ వాహనం
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* టూర్ ఎస్కా్ర్ట్ సేవలు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* మధ్యాహ్న భోజనం
* ఎంట్రీ టికెట్లు
* వ్యక్తిగత ఖర్చులు
* టిప్స్, గైడ్ చార్జీలు

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

హైదరాబాద్ నుంచి ఊటీ ట్రిప్.. రూ.13 వేలలోనే టూర్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ!