IndiGo Staff Dance Viral : ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఏడు రోజులుగా ఇబ్బందులు పడుతుండగా, పనిలేక ఖాళీగా ఉన్న ఆ సంస్థ సిబ్బంది ఆటపాటల్లో, డ్యాన్స్‌ రీల్స్‌ వీడియోల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IndiGo Staff Dance Viral : ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్

విధాత : ఇండిగో విమాన సర్వీస్ ల రద్దుతో ఓ వైపు ప్రయాణికులు ఏడు రోజులుగా తీవ్ర అవస్థలకు గురవ్వడం అందరికి తెలిసిందే. ఇండిగో సంస్థ నిర్వాకంతో విమాన సర్వీస్ లు రద్దయిపోగా..ప్రయాణికులు ఎయిర్ పోర్టులలో పడిన ఇబ్బందులు అన్ని ఇన్నికావు. ఇదే అదునుగా ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకున్నాయి. ఏడో రోజు కూడా 300కు పైగా ఇండిగో విమాన సర్వీస్ లు రద్దవ్వగా..ప్రయాణికుల తిప్పలు కొనసాగాయి.

అయితే ఇండిగో విమానాల రద్దుతో ఆ సంస్థ సిబ్బంది తమకు ఎలాగు పని లేదనుకున్నారే ఏమోగాని హాయిగా ఆటపాటల్లో మునిగారు. డాన్స్ లతో రీల్స్ వీడియోలు చేసుకుంటూ కాలక్షేపంలో మునిగారు. ఇండిగో విమాన సిబ్బంది డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు దీనికంతటికి ఇండిగో యాజమాన్యం కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. విమాన పైలట్ల పనిగంటలపై డీజీసీఏ తెచ్చిన కొత్త నిబంధనలను ఇండిగో అమలు చేసి ఉంటే..ఇటు ప్రయాణికులకు పాట్లు..సిబ్బంది ఆటపాటలు తప్పేవని కామెంట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఇండిగో అదనపు పైలట్లు, సిబ్బంది నియామకం చేపడుతున్న తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇండిగో వ్యవహారం విమాన సర్వీస్ లలో గుత్తాధిపత్యంతో ఎదురయ్యే సమస్యలపై ఓ గుణ పాఠంగా తీసుకుని కేంద్రం విమానయాన రంగం సేవల విధానాలను పునస్సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Telangana Global Summit : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
Akira Nandan | ఏఐతో అకిరా హీరోగా సినిమా… పవన్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్ గెస్ట్ పాత్ర‌ల్లో..!