New Airlines | ఇండిగో దెబ్బతో 3 కొత్త ఏయిర్ లైన్స్ కు అనుమతి
ఇండిగో ఏయిర్ లైన్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మూడు ప్రైవేటు ఏయిర్ లైన్స్ సర్వీసులను చూడబోతుననారు. శంఖ్ ఏయిర్, అల్ హింద్ ఏయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్ లకు కేంద్ర పౌర విమానయాన శాఖ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసింది.
- ఇండిగో దెబ్బతో 3 కొత్త ఏయిర్ లైన్స్ కు అనుమతి
- ఎన్వోసీ జారీ చేసిన విమానయాన శాఖ
- మరో ఆరు నెలల్లో ఎగరనున్న కొత్త విమానాలు
ఇండిగో ఏయిర్ లైన్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత ప్రయాణీకులు త్వరలో మూడు ప్రైవేటు ఏయిర్ లైన్స్ సర్వీసులను చూడబోతుననారు. శంఖ్ ఏయిర్, అల్ హింద్ ఏయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్ లకు కేంద్ర పౌర విమానయాన శాఖ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసింది. దేశంలోని కొద్ది సంఖ్యలో ఉన్న ఏయిర్ లైన్స్ కంపెనీలపై ఆధారపడకూడదని, దానికి ఇండో ఏయిర్ లైన్స్ ఉధంతమే తాజా ఉదాహారణగా కేంద్రం భావించింది. కొత్తగా వచ్చే మూడు ఏయిర్ లైన్స్ తో పోటీ పెరిగి, ప్రయాణీకులకు సత్వర సేవలు లభిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం 9 డొమెస్టిక్ ఏయిర్ లైన్స్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇండిగో ఏయిర్ లైన్స్ అకస్మాత్తుగా సర్వీసులు నిలిపివేయడం, రద్ధు చేయడం, సమయాలు మార్చడం వంటి కారణాలతో విమానయాన ప్రయాణీకులు అష్టకష్టాలు పడ్డారు. విమానాలను పునరుద్ధరించినా ఇంకా గాడిలో పడలేదు. ప్రతినిత్యం స్వల్ప సంఖ్యలో ఇండిగో విమానాలు రద్ధవుతునే ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశీయ ప్రయాణీకులతో పాటు విదేశీ ప్రయాణీకులు కూడా పెరుగుతూ వస్తున్నారు. పెరుగుదలకు అనుగుణంగా విమానాలు పెరగకపోవడం సమస్యలకు దారితీస్తున్నది. ఇండిగో ఏయిర్ లైన్స్, ఏయిర్ గ్రూపుల ఆధీనంలో ఎక్కువ సంఖ్యలో విమానాలు ఉన్నాయి. దేశంలోని మొత్తం విమానాల సంఖ్యలో ఇండిగో 65 శాతం, ఏయిర్ ఇండియా 23 శాతం విమానాలు కలిగి ఉన్నాయి. ఇండిగో ఏయిర్ లైన్స్ ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ పోవడం, మిగతా విమానాయాన సంస్థలు కూడా విస్తరించకపోవడంతో గుత్తాధిపత్యానికి దారితీసిందని విమానయానరంగం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కేంద్రం ఇండిగో ఏయిర్ లైన్స్ పరిణామాలు, ప్రయాణీకుల నుంచి ఎదురైన విమర్శలను గమనించి మూడు కొత్త ప్రైవేటు ఏయిర్ లైన్స్ కు పచ్చ జెండా ఊపింది.
కేరళ రాష్ట్రానికి చెందిన అల్ హింద్ గ్రూపునకు చెందిన అల్ హింద్ ఏయిర్ పేరు ఏయిర్ లైన్స్ వ్యాపారంలోకి దిగింది. ప్లై ఎక్స్ ప్రెస్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నది. శంఖ్ ఏయిర్ లైన్స్ కు ఇప్పటికే ఎన్వోసీ జారీ చేశారు. 2026 సంవత్సరం మధ్యలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. అయితే అల్ హింద్ ఏయిర్, ఫ్లై ఎక్స్ ప్రెస్ కు ఈ వారంలో ఎన్వోసీ జారీ చేయనున్నారు. విమానాలు గాల్లోకి ఎగరానికి ఇంకా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకుల కోసం, విమానయాన రంగాన్ని మరింతగా విస్తరించే కొత్తగా మూడు ఏయిర్ లైన్స్ ను అనుమతిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉడాన్ పథకం కింద స్టార్ ఏయిర్, ఇండియా వన్ ఏయిర్ తో పాటు ఫ్లై 91 ఏయిర్ లైన్స్ చిన్న నగరాల మధ్య నడిపించేందుకు ముందుకు వచ్చాయి. ఈ మూడు సంస్థల ద్వారా డొమెస్టిక్ ఏయిర్ వేస్ లో రద్దీ పెరిగిందన్నారు. ఇంకా చిన్న చిన్న పట్టణాల మద్య నడిపేందుకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లెక్కల ప్రకారం ఇండిగో, ఏయిర్ ఇండియా, ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, అలయన్స్ ఏయిర్, ఆకాశ ఏయిర్, స్పైస్ జెట్, స్టార్ ఏయిర్, ఫ్లై 91, ఇండియా వన్ ఏయిర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా జెట్ ఏయిర్ వేస్, గో ఫస్ట్ ఏయర్ లైన్స్ తమ కార్యకలాపాలను మూసివేశాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram