Indigo : ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
ఇండిగో సంక్షోభంలో ఇక నేడు 300కి పైగా విమానాలు రద్దు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో ప్రయాణికులు ఇబ్బందుల్లో పడారు.
విధాత, హైదరాబాద్ : ఇండిగో విమాన సర్వీస్ ల సంక్షోభం నేపథ్యంలో వరుసగా ఏడో రోజు కూడా దేశ వ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 59 అరైవల్స్, 75 డిపార్చర్స్‌తో కలిపి మొత్తం 134 విమానాలు రద్దు అయ్యాయి. బెంగళూరులో 127, చెన్నైలో 71, హైదరాబాద్‌లో 77, జైపూర్‌లో 27 విమానాలు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గంటల తరబడి ఎయిర్‌పోర్ట్స్‌లోనే పడిగాపులు పడ్డారు. మరోవైపు ప్రయాణికుల లగెజీలతో ఎయిర్ పోర్టులు డంపింగ్ యార్డులను తలపించాయి. ప్రయాణికులు తమ సమస్యలపై ఎయిర్ పోర్టులలో సిబ్బందితో గొడవ పడుతున్న దృశ్యాలు కొనసాగాయి.
మరోవైపు ఇండిగో’ బాధితులకు సాయం చేసేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం వాదనలు వినేందుకు కోర్టు అంగీకరించింది. అటు ఇండిగో విమానాల రద్దు విషయంలో అత్యవసరంగా వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకొంటోందని వ్యాఖ్యానించింది. కాగా ఇండిగో సర్వీస్ ల రద్దు నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు పతనమయ్యాయి. సోమవారం తొలుత 7శాతం విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
ఆ తర్వాత కోలుకొని ప్రస్తుతం 3శాతానికి పైగా నష్టాల వద్ద కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Actor Dileep : లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
Kalvakuntla Kavitha| మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram