Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్వీస్టు..హైకోర్టులో సీబీఐ అప్పీల్

ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త మలుపు. రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్‌పై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. కేసు మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్వీస్టు..హైకోర్టులో సీబీఐ అప్పీల్

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కొట్టివేస్తూ.. సీబీఐ నిందితులుగా పేర్కొన్న కేజ్రీవాల్‌, కవిత, మనీష్‌ సిసోడియా సహా మొత్తం 23మంది నిందితులకు క్లీన్‌చిట్‌ ఇస్తూ శుక్రవారం ఉదయం రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసులో పలు ఆధారాలను ట్రయల్‌ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ అప్పీల్‌ దాఖలు చేసింది.

అంతకుముందు రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేస్తూ నిందితులందరికి క్లీన్ చీట్ ఇవ్వడంతో కేజ్రీవాల్, కవిత సహా నిందితులు సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయంగా తమపై మోపిన అక్రమ కేసు అని.. కోర్టు తీర్పుతో నిరూపితమైందంటూ తెలిపారు.ఇంతలోనే ఈ కేసుపై సీబీఐ అప్పిల్ కు వెళ్లడం కేసు విచారణను మరో మలుపు తిప్పినట్లుయ్యింది.

ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్, సీనియర్ అడ్వకేట్ రామచందర్ రావు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసును సాంకేతిక కారణాల రిత్యా రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసిందన్నారు. అంతమాత్రాన అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత తప్పు చేయలేదని అర్థం కాదన్నారు. కేసును డిశ్చార్జ్ చేసినంత మాత్రాన వారంతా నిర్దోషులు అయిపోరని పేర్కొన్నారు. అలా భావిస్తే ఇది వారి అమాయకత్వమే అవుతుందని విమర్శించారు. ప్రస్తుత తీర్పు కేవలం ట్రయల్ కోర్టు నుంచి వచ్చినది మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై సీబీఐ అప్పీల్ కు వెళ్లవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు కోరిన డాక్యుమెంట్స్ ను ముద్దాయిలు ఇవ్వకపోవడంతో..కోర్టు అడిగిన సమాచారాన్ని సీబీఐ అందించలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదని.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ రామచందర్ రావు హెచ్చరించారు.

ఈ కేసులో కవిత ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్, సిమ్ కార్డును ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేజ్రీవాల్ మద్యం పాలసీని మార్చుకోవాల్సినంత అవసరం ఏమి వచ్చిందని నిలదీశారు. నిజానికి ఢిల్లీ లిక్కర్ కేసు విచారణతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రామచందర్ రావు స్ఫష్టం చేశారు. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద తొలుత సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Chilkur Balaji Temple : చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు సౌందర రాజన్ కన్నుమూత
Urea Shortage | యూరియా కోసం మళ్లీ రైతుల పడిగాపులు.. పంట చేతికొచ్చే సమయంలో అష్టకష్టాలు