మేకపై స్కూల్ కు విద్యార్థి..వైరల్ వీడియో

మేఘాలయలో ఓ విద్యార్థి తమ పెంపుడు మేకపై కూర్చుని స్కూల్‌కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి వినూత్న ప్రయాణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

దేశంలో విద్యార్థులు నేటి రోజుల్లో పాఠశాలలకు బస్సులు, ఆటోలు, లేదా తల్లిదండ్రుల సొంత వాహనాలపైన ,లేక సైకిళ్లపైన వెలుతుండటం సాధారణంగా కొనసాగుతుంది. అయితే మేఘాలయలోని గారో హిల్స్‌కు చెందిన ఒక పాఠశాల విద్యార్థి పాఠశాలకు వెళ్లేందుకు వినూత్న వాహనాన్ని ఎంచుకున్నాడు. తమ పెంపుడు మేకపై కూర్చుని ఆ చిన్నారి విద్యార్థి స్కూల్‌కి వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మిగతా పిల్లలంతా బస్సులు, బైకులు లేదా కార్లలో వెళ్తుంటే.. ఈ బుడతడు మాత్రం తన నాలుగు కాళ్ల నేస్తాన్ని ఎంచుకుని పాఠశాలకు వెళ్తుండటం ఆసక్తికరం. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంటూ అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది.

Latest News