బంగ్లాదేశ్‌లో “డొనాల్డ్ ట్రంప్” పేరుతో వైరల్ అయిన అల్బినో గేదె బక్రీద్ బలి నుంచి తప్పుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్‌గంజ్‌లో ఉన్న ఓ డెయిరీ ఫారంలో పెంచుతున్న నాలుగేళ్ల ఆల్బినో గేదె గులాబీ రంగు చర్మం, మెరిసే బంగారు రంగు జుట్టుతో 700కిలోల బరువుంటుంది. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టుతో అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్‌స్టైల్‌ను పోలి ఉండటంతో దీనిని స్థానికులు “ట్రంప్” అనే పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రంప్ ముఖాకృతి పోలికలతో ఉండటంతో అరుదైన ఓ తెల్ల రంగు గేదెకు ఆయన పేరు స్థిరపడిపోయింది. సోషల్ మీడియాలో ట్రంప్ తెల్ల గేదె సంచలనం సృష్టించింది. వేలాది మంది వచ్చి దానితో సెల్ఫీలు దిగడంలో అదో సెలబ్రెటీగా మారిపోయింది. ఇంతలోనే ఆ “ట్రంప్ బఫెలో” కథ అనుకోని మలుపు తిరిగింది.
ఆ పేరే ఇప్పుడు దాని ప్రాణాలు కాపాడింది..
వివరాల్లోకి వెళితే..ఈద్ అల్-అధా పండుగ సందర్భంగా ఈ అరుదైన తెల్లరంగు గేదెను ఫారం యజమాని జియౌద్దీన్ మృధా బలి ఇవ్వడానికి అమ్మేశాడు. ‘ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్ చెబుతున్నారు. అయితే ట్రంప్ పేరుతో వైరల్ గా మారిన ఆ గేదెను బలి ఇవ్వకుండా రక్షించాలంటూ ఆన్‌లైన్‌లో ప్రజల నుండి విపరీతమైన స్పందన రావడంతో, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. ట్రంప్ గేదె బలిని అడ్డుకుని.. కొనుగోలుదారునికి డబ్బులు తిరిగి చెల్లించి, ఈ గేదెను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఢాకా నేషనల్ జూకు ప్రభుత్వ అధికారులు తరలించారు. ట్రంప్ పేరుతో ఆ గేదె ఫేమస్ కాకపోయి ఉంటే..తనకు ఇదే చివరి బక్రీద్ అయి ఉండేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
A rare albino BUFFALO in Bangladesh nicknamed “DONALD TRUMP” was SPARED from Eid al-Adha sacrifice after going VIRAL online.
The 700-kg buffalo was already sold, but the Government INTERVENED as HUGE CROWDS gathered to see it.
Authorities refunded the buyer and MOVED the… pic.twitter.com/Ydfuiifq4O
— Suppressed News. (@SuppressedNws1) May 27, 2026
