Diwali Most Expensive Sweet | అక్కడ స్వీట్ కేజీ రూ.1లక్ష 11వేల ధర

రాజస్థాన్ జైపూర్‌లో 'స్వర్ణ ప్రసాదం' అనే స్వీటు కేజీ ధర ₹1,11,000గా నిర్ణయించారు. దీపావళి సందర్భంగా ఈ స్వీటును 24 క్యారెట్ల తినదగిన బంగారంతో (స్వర్ణ భస్మ) మరియు ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తున్నారు.

Diwali Most Expensive Sweet | అక్కడ స్వీట్ కేజీ రూ.1లక్ష 11వేల ధర

విధాత : రాజస్థాన్ జైపూర్ లో దీపావళీ సందర్బంగా ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్న స్వీటు కేజీ ధర ఏకంగా రూ.1,11,000గా నిర్ణయించారు. స్వీటు ధర వింటేనే గుండెల్లో దీపావళి బాంబులు పేలినట్లుంది. అయితే ఈ స్వీటును ఏకంగా బంగారంతో తయారు చేయడం తెలిస్తే మరింత షాక్ అవుతారు. జైపూర్‌లో త్యోహార్‌ స్వీట్‌ స్టాల్‌లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ స్వీట్ కు అక్షరాల రూ.1,11,000ధర నిర్ణయించారు. ఈ స్వీటును ఖరీదైన ప్రీమియం డ్రై ఫ్రూట్స్ తో, తినదగిన నిజమైన బంగారంతో తయారు చేశారు. స్వర్ణ భస్మ అని పిలువబడే 24 క్యారెట్ల బంగారాన్ని దీనిలో నింపుతున్నారు. అందుకే దీనిని బంగారు బూడిద అని కూడా పిలుస్తారు.

స్వర్ణ ప్రసాదం విక్రయించే స్వీట్ అవుట్‌లెట్ యజమాని, స్వయంగా చార్టర్ అకౌంటెంట్ కూడా అయిన అంజలి జైన్ మాట్లాడుతూ, ఈ స్వీట్ భారతదేశంలో అత్యంత ఖరీదైన స్వీట్ గా పేర్కొన్నారు. దీని రూపం, ప్యాకేజింగ్ కూడా చాలా ఖరీదైనదని తెలిపారు. ఈ స్వీటును ఒక ఆభరణాల పెట్టెలో ప్యాక్ చేస్తారని తెలిపారు. తాము తయారు చేసిన ఈ స్వీటుపై బంగారం, వెండి పూత పూస్తామని తెలిపారు. తమ స్వీట్లలో పైన్‌ గింజలు, కుంకుమ పువ్వు, బంగారు భస్మం ఉన్నాయని వెల్లడించారు. స్వచ్ఛమైన బంగారం పూత కారణంగానే ధర అధికంగా ఉందని పేర్కొన్నారు. బంగారు భస్మంలో ఆయుర్వేద లక్షణాలుంటాయన్నారు. ప్రముఖ జైన దేవాలయం నుండి కొనుగోలు చేసిన బంగారం నుంచి తీసిన పొడిని స్వీట్ లో వాడుతున్నామని తెలిపారు. ఇది జంతు హింస లేనిదని పేర్కొన్నారు.