Cooking Gas Shortage | ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్ నింపుకుంటున్న పాక్ ప్రజలు.. మొబైల్ బాంబ్‌గా మారిపోతున్న ఇళ్లు

Cooking Gas Shortage | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో వంటగ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చడంతో పాకిస్థాన్ ప్రజలు ప్రమాదకరమైన పద్ధతులను ఎంచుకుంటున్నారు. గ్యాస్ లోడ్ షెడ్డింగ్‌తో విసిగిపోయిన ప్రజలు.. ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్‌ను స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు.

Cooking Gas Shortage | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో వంటగ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చడంతో పాకిస్థాన్ ప్రజలు ప్రమాదకరమైన పద్ధతులను ఎంచుకుంటున్నారు. గ్యాస్ లోడ్ షెడ్డింగ్‌తో విసిగిపోయిన ప్రజలు.. ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్‌ను స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు భయాందోళనలకు గురి చేస్తోంది.

ముఖ్యంగా కరాచీలోని ఓరంగీ టౌన్, మోమినాబాద్ పరిసరాల్లో ఇలా ప్లాస్టిక్ బెలూన్లలలో గ్యాస్ నింపుకోవడం ఎక్కువగా ఉంది. పైప్‌లైన్‌లో గ్యాస్ సరఫరా కొద్దిసేపు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆ సమయంలో ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపి తర్వాత రోజంతా వాడుకుంటున్నట్లుగా నిర్వాసితులు చెబుతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. గ్యాస్ నింపడం కోసం ప్రత్యేకమైన ప్లాస్టిక్ బెలూన్లను స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారట. ఈ బెలూన్ల ధర ఒక్కొక్కటి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు లభిస్తుందని సమాచారం. వంట గ్యాస్ రెగ్యులర్‌గా రాకపోవడంతో.. ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని పాక్ ప్రజలు చెబుతున్నారు.

అయితే ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్ నింపే విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్యాస్ నింపిన ప్లాస్టిక్ బెలూన్లు మొబైల్ బాంబుతో సమానమని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప రాపిడి, వేడి లేదా చిన్న మంట తగిలినా భారీ పేలుడుకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరమని అంటున్నారు.

ఇళ్లలో గ్యాస్ బెలూన్లు ఉంచడం వల్ల అగ్నిప్రమాదాల ముప్పు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని.. ఈ ప్రాణాంతక ధోరణిని అరికట్టాలని సూచిస్తున్నారు.

Read More:

ఒకే స్కూటర్‌పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!

DINK | సింగిల్ బెడ్రూం ప్లాట్ కూడా కొనలేని మాకు పిల్లలు అవసరమా? ఆలోచనలో పడేస్తున్న యువ దంపతుల నిర్ణయం

Latest News