DINK | సింగిల్ బెడ్రూం ప్లాట్ కూడా కొనలేని మాకు పిల్లలు అవసరమా? ఆలోచనలో పడేస్తున్న యువ దంపతుల నిర్ణయం

గురుగ్రామ్‌లోని ఓ యువ దంపతులు సంవత్సరానికి రూ.36 లక్షలు సంపాదిస్తున్నారు. అయినప్పటికీ తమకు పిల్లలను పోషించే స్తోమత లేదని చెప్పి.. పిల్లలు వద్దని నిర్ణయించుకున్నారు. DINK (Double Income No Kids) సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.

Reported by: Chandram | జాతీయం | Apr 29, 2026, 8:19 pm IST
Read Time: 4 mins
DINK | సింగిల్ బెడ్రూం ప్లాట్ కూడా కొనలేని మాకు పిల్లలు అవసరమా? ఆలోచనలో పడేస్తున్న యువ దంపతుల నిర్ణయం

DINK | నగరాల్లో పెరిగిపోతున్న ఖర్చులకు.. లక్షల్లో జీతం వస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. దీంతో ఓ జంట సంచలన నిర్ణయం తీసుకుంది. భార్యభర్తలు ఇద్దరూ కలిసి సంవత్సరానికి రూ.36లక్షలు సంపాదిస్తున్నప్పటికీ.. తాము సింగిల్ బెడ్రూం ఫ్లాట్ కూడా కొనలేని స్థితిలో ఉన్నామని భావిస్తున్నారు. అందుకే పిల్లలను కూడా వద్దని డిసైడ్ అయిపోయారు. ఈ నిర్ణయాన్ని ఆ దంపతుల బంధువు ఒకరు నెట్టింట పంచుకోగా వైరల్‌గా మారింది.

హర్ష గుప్తా అనే అనే వ్యక్తి ఒక పోస్టును పెట్టారు. అతని పోస్టు ప్రకారం.. తన కజిన్ ఒకరు గురుగ్రామ్‌లో నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. అతని భార్య నెలకు లక్ష రూపాయల వరకు జీతం వస్తుంది. ఇద్దరూ గురుగ్రామ్‌లో ఉంటారు. అతని వయసు 35 సంవత్సరాలు. ఇప్పటికీ పిల్లలను వద్దని అనుకుంటున్నారు. అతని సంపాదనకు గురుగ్రామ్‌లో కనీసం సింగిల్ బెడ్రూం ఫ్లాట్ కూడా రాదట. తన కోసం ఒక ఇంటినే రెడీ చేసుకోలేనప్పుడు పిల్లలు ఎందుకు అని అతను ప్రశ్నించాడట. పిల్లల స్కూల్ ఫీజుల కింద నెలకు రూ.40 వేలు భరించే అంత స్థాయి తనకు లేదని అన్నాడని తన పోస్టులో చెప్పారు.

నగరాల్లో పెరుగుతున్న ఇంటి ధరలు, పిల్లల విద్య ఖర్చులు వైద్య వ్యయం, రోజువారీ అవసరాల ధరలు కలిపి యువ దంపతులను తీవ్ర ఆలోచనలో పడేస్తున్నాయని గుప్తా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పిల్లలను కనాలా? వద్దా అనే నిర్ణయం కూడా ఇప్పుడు భావోద్వేగం కంటే ఆర్థిక లెక్కల ఆధారంగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ జంటనే కాదు.. చాలామంది ఇదే DINK ( Double Income No Kids) సూత్రాన్ని ఫాలో అవుతుంటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అనేక మంది జంటలు ఈ నిర్ణయంతోనే ఏకీభవిస్తున్నారు. పిల్లల భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించి, వారికి మంచి జీవితం ఇవ్వగలమా లేదా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత పిల్లల గురించి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ప్రశంసిస్తున్నారు. అయితే ఆ జంటకు తాము చేసిన తప్పు తొందరలోనే తెలిసి వస్తుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

Read More:

ఒకే స్కూటర్‌పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!

Hair Growth Temple | ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్‌లో వైరల్‌గా మారిన మికామి ఆలయం