పెళ్లి కారు అలంకరణలో కొత్త ట్రెండ్.. !
పండ్లు, స్నాక్స్‌తో పెళ్లి కారును అలంకరించిన వీడియో వైరల్. కొత్త ట్రెండ్ ఆకట్టుకుంటున్నా కోతుల బెడదపై నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
విధాత : పెళ్లిళ్ల ఊరేగింపులో..వధూవరులను పెళ్లీ మండపాలకు తరలించే క్రమంలో తమ కారులను రకరకాల రంగుల పూలతో అందంగా అలకరించుకొనడం సాధారణంగా చూస్తుంటాం. ఇలా పూలతో అలంకరించే సంప్రదాయానికి బదులుగా కొందరు వినూత్న ఆలోచన చేశారు. రకరకాల పండ్లు, స్నాక్స్ ప్యాకెట్లతో పెళ్లి కారును అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడటానికి రోడ్డుపై ఈ వినూత్న డెకరేషన్ తో కూడిన పెళ్లి కారు ప్రత్యేకంగా వింతగా ఉండటంతో అందరిని ఆకట్టుకుంది.
కోతులున్నాయ్ జాగ్రత్త మరి!
అయితే దానిని చూసిన కొందరు మాత్రం పండ్లు, స్నాక్స్ తో అలంకరించిన ఈ కారు పెళ్లి పనుల్లో నిజంగా ఉపయోగపడితే మంచిదేనని..అయితే అంతకుముందే ఏ కోతుల గుంపు కంట పడితే మాత్రం అంతా రచ్చరచ్చేనంటూ హెచ్చరిస్తున్నారు. అందుకే ఏదైనా పనిచేసే క్రమంలో ముందు వెనుక ఆలోచించాలని హితవు చెబుతున్నారు. ఈ రోజుల్లో వనాలు తరిగిపోయి..జనావాసాలు పెరిగిపోయి కొండలు, గుట్టల్లో ఉండాల్సిన కోతుల గుంపులు చాల ప్రాంతాల్లో ఊర్లు, పట్టణాలపై పడి నానా బీభత్సం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి కారును గొప్పల కోసం పండ్లు, స్నాక్స్ తో అలంకరించుకుని వెళితే ..కోతుల గుంపుతో ప్రమాదం తప్పదని పెద్దలు హెచ్చరిస్తున్నారు.
పెళ్లి కారు అలంకరణలో కొత్త ట్రెండ్
పూలతో అలంకరించే సంప్రదాయానికి బదులుగా, పండ్లు మరియు స్నాక్స్ ప్యాకెట్లతో కారును అలంకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది#WeddingCar #WeddingTrends#CarDecoration pic.twitter.com/jGKVlC8YWH
— greatandhra (@greatandhranews) April 14, 2026
ఇవి కూడా చదవండి :
నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!
నకిలీఉద్యోగం.. 67 పెళ్లిళ్లతో ఘరానా మోసం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram