విధాత: విక్టరీ వెంకటేష్ తెలుగులో సీనియర్ టాప్ స్టార్. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు గతంలో అద్భుతమైన విజయాలను సాధించాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల జొన్నర్స్ను ఆయన టచ్ చేశారు. కుటుంబ కథా చిత్రాల హీరోగా యాక్షన్ చిత్రాల హీరోగా తన సత్తా చాటారు. కానీ గత కొంతకాలంగా మిగతా ఆగ్ర తారలతో పోలిస్తే కాస్త రేసులో వెనుకబడిపోయి ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేసే వేగం కూడా […]
విధాత: విక్టరీ వెంకటేష్ తెలుగులో సీనియర్ టాప్ స్టార్. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు గతంలో అద్భుతమైన విజయాలను సాధించాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల జొన్నర్స్ను ఆయన టచ్ చేశారు. కుటుంబ కథా చిత్రాల హీరోగా యాక్షన్ చిత్రాల హీరోగా తన సత్తా చాటారు. కానీ గత కొంతకాలంగా మిగతా ఆగ్ర తారలతో పోలిస్తే కాస్త రేసులో వెనుకబడిపోయి ఉన్నారు.
ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేసే వేగం కూడా తగ్గింది. చాలా నింపాదిగా అతి తక్కువ చిత్రాలు మాత్రమే ఒప్పుకుంటున్నారు. దాంతో ఆయన తన కెరీర్లో ఇప్పటివరకు కేవలం 75 చిత్రాలు మాత్రమే చేయగలిగారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న అతని 75వ చిత్రం యాక్షన్ త్రిల్లర్గా రూపొందుతోంది. ఇదో రివేంజ్ డ్రామా అంటున్నారు.
తాజాగా సినిమా టైటిల్, పోస్టర్ని విడుదల చేశారు. దీని నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కోలను ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ చిత్రానికి టైటిల్‌గా సైంధవ అనే పేరును ఖరారు చేశారు. ఇటీవల విజయాల పరంగా వెంకటేష్ స్లో కావడం ఫ్యాన్స్ ని కాస్త నిరాశ పరుస్తుంది.
అలాంటి సమయంలో వెంకి ఈ సినిమాతో సక్సెస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా చిత్రం చేసి చాలాకాలం అయింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలకపాత్రను పోషించనున్నాడని అధికారికంగా ప్రకటించారు.
ఎన్నో విభిన్న చిత్రాలతో ఈయన సుపరిచితుడు. నవాజుద్దీన్ సిద్ధికి పాత్ర ఖచ్చితంగా సైంధవకు అదనపు ఆకర్షణ కాబోతుందని చెప్పవచ్చు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు వెంకీ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఇది.
ఇందులో నవాజుద్దీన్ సిద్ధికి నటించడం వల్ల కచ్చితంగా ఉత్తరాదిలో బజ్ క్రియేట్ అవుతుంది. మొత్తానికి వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రం సరి కొత్త పంథాలో సాగుతూ వెంకటేష్ కు ఘర్షణ తరహాలో భారీ హిట్టును అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు..!