Vastu Tips | బీరువాను ఈ దిశలో ఉంచితే.. జీవితాంతం కష్టాలే.. జర జాగ్రత్త..!
Vastu Tips | ఖరీదైన బట్టలు( Clothes ), నగలతో( Ornaments ) పాటు నగదు( Money ) ఉంచే బీరువా( Beeruva ) కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటి ఆర్థిక విషయాల్లో కీలకమైన బీరువాను ఇంట్లో ఏ దిశలో అంటే ఆ దిశలో ఉంచకూడదు. సరైన దిశలో బీరువాను ఉంచినప్పుడే.. ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు( Financial Problems ) తొలగిపోతాయట.

Vastu Tips | ప్రతి ఇంట్లో బీరువా( Beeruva ) ఉంటుంది. ఇంట్లో ఉండే బీరువాలో ఖరీదైన బట్టలు( Clothes ), నగలతో( Ornaments ) పాటు డబ్బును( Money ) కూడా ఉంచుతారు. ఈ నేపథ్యంలో బీరువాను ఇంటి యజమాని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన బీరువాకు కూడా వాస్తు నియమాలు( Vastu Tips ) ఉన్నాయి. ఇంట్లో ఏ దిశలో అంటే ఆ దిశలో బీరువా( Almirah )ను ఉంచితే.. జీవితాంతం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన దిశలో బీరువాను ఉంచడం ద్వారా ఆ ఇంట్లో అష్టైశ్వరాలు సిద్ధిస్తాయని, ఆర్థిక స్థిరత్వం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి బీరువాను ఏ దిశలో ఉంచాలి..? ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో తెలుసుకుందాం..
బీరువా ఏ దిశలో ఉంటే మంచిది..?
వాస్తు నియమాల ప్రకారం నియమించిన ఇంటిలో.. బీరువాను ఉంచేందుకు కూడా వాస్తు నియమాలు పాటించండి. ఇంట్లో బీరువాను ఉత్తర దిశలో ఉంచితే అత్యంత శుభప్రదమని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర దిక్కు కుబేరుడికి స్థానం ఉంటుంది. అయితే బీరువాను ఉత్తర దిశలో ఉంచి తెరిచినప్పుడు అది దక్షిణం వైపునకు తెరుచుకుంటుంది. దీంతో ఆ ఇంట్లో ధన ప్రవాహం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తూర్పు దిశ కూడా మంచిదే అంటున్నారు. ఈ దిశలో బీరువా ఉంటే అది పడమర వైపునకు తెరుచుకుంటుంది. ఈ దిశ కూడా సంపదను ఆకర్షిస్తుంది.
మరి ఏ దిశలో బీరువాను ఉంచకూడదు..?
బీరువాను పడమర, దక్షిణ దిశల్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దిశల్లో బీరువాను ఉంచినట్లు అయితే.. ఉత్తరం లేదా తూర్పు వైపునకు తెరుచుకుంటాయి. ఈ రెండు దిశలు కూడా ధనాన్ని బయటకు పంపిస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈ రెండు దిశల్లో బీరువాను ఉంచకపోవడమే మంచిది.
ఏ రంగు బీరువా శుభప్రదం..?
దిశలు ఒకే.. మరి ఏ రంగులో ఉన్న బీరువా మంచిది అంటే.. క్రీమ్, బ్రౌన్ లేదా ఎల్లో కలర్ బీరువాలు శుభప్రదమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముదురు రంగులు, ముఖ్యంగా నీలం, బ్లాక్ కలర్ రంగులు ఉన్న బీరువాలను ఇంట్లోకి తీసుకురావొద్దు. ఈ రంగుల బీరువాల వల్ల ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు.