మొసలి నాటకం..నోటికి చిక్కిన మేక

మొసలి నాటకం..నోటికి చిక్కిన మేక

విధాత : ప్రకృతిలో ఆహారపు వేటలో జంతువులు పడే పాట్లు క్రూరంగాను.. ఒక్కోసారి గమ్మత్తుగాను ఉంటాయి. ఓ మొసలి తన ఆహారపు వేటలో వేసిన నాటకం వీడియో చూస్తే విస్మయం కల్గకమానదు. కార్యసాధనలో మనుషులే కాదు…జంతువులు కూడా నటిస్తాయనడానికి నిదర్శనంగా ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ డ్యాం నుంచి నీటి విడుదల చేసే కాలువ నుంచి బయటకు వచ్చిన మొసలి గట్టుపై చచ్చినట్టుగా పడి ఉంది. అటుగా మేత కోసం వచ్చిన మేకలు కాలువ వెంట ఉన్న గడ్డిని తినేందుకు ప్రయత్నించాయి. అయితే అక్కడే పడిఉన్న మొసలిని చూసి భయంతో కొంత దూరంగా జరిగాయి. అయితే తమ అలికిడి వినికూడా మొసలి కదలకపోవడంతో అది చచ్చిపోయి ఉంటుందనుకుని దూరంగా వెళ్లిన ఓ మేక మళ్లీ వెనక్కి వచ్చి దానికి దగ్గరగా వెళ్లింది.

అంతే..అప్పటిదాక తన చుట్టు నాలుగైదు మేకలు తిరుగుతున్నా పట్టించుకోకుండా చచ్చినట్టు నటించి వాటిని మభ్యపెట్టిన మొసలి ఓ మేక తన దగ్గర వరకు రాగానే ఒక్క ఉదుటున దాని గొంతు పట్టుకుంది. మొసలి పట్టు నుంచి తప్పించుకునేందుకు పోరాడే క్రమంలో మేక, మొసలి రెండు కూడా పక్కనే ఉన్న కాలువలో పడిపోయాయి. ఒక్కసారి నీళ్లలోకి వెళ్లాక మొసలి పట్టు నుంచి తప్పించుకోవడం ఇక ఆ మేకకు అసాధ్యమైపోగా దానికి ఆహారంగా మారిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మొసలి తెలివిని మెచ్చుకుంటునే…పాపం బకరా మేక అంటూ కామెంట్లు చేశారు. వేటలో తన శక్తి కంటే యుక్తితో సులభంగా విజయం సాధించవచ్చని మొసలి చాటిచెప్పిందని మరికొందరు కామెంట్ పెట్టా.