ప్రకృతిలో జరిగే సంఘటనలు ఒక్కోసారి విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా విధి రాతను ఎవరు మార్చలేరన్నట్లుగా అనిపించే కొన్ని సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. నిద్రిస్తున్న పసికందు వద్దకు చేరబోతున్న ఓ పామును నెమలి నోటకరుచుకుని పసికందును కాపాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఓ పల్లెటూరిలో ఇంటి ఆవరణలో మంచంపై పడుకోబెట్టిన పసికందు వద్దకు ఓ పాము పాకుతూ వచ్చింది. అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ నెమలి ఫ్రేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసి.. పామును తన నోట కరుచుకుని అంతే వేగంతో తన ఈకలను విప్పి గాలిలోకి ఎగిరిపోయింది.
ఈ సంఘటనను చూసిన నెటిజన్లు చిన్నారుల సంరక్షణను ఆ దేవుడే పలు రూపాల్లో వచ్చి చూసుకుంటాడని పేర్కొంటూ, నెమలి చర్యను ఒక రకమైన దైవిక జోక్యంగా చిత్రీకరించారు. అయితే భారతదేశంలో నెమళ్లు సహజంగానే పాములను వేటాడుతాయి. వాటి ఆహారంలో పాములు ఓ భాగం కూడా. అయితే చిన్నారి సంరక్షణ వీడియోకు వన్యప్రాణుల సహజ ప్రకృతి నియమాలతో, దైవిక రక్షణ చర్యలతో ముడిపెట్టేసి.. అదంతా ఓ దైవిక ఘటనగా అభివర్ణించడం ఈ వీడియోకు మరింత ఆదరణ తెచ్చిపెట్టింది.
छोटे बच्चौ की रखवाली भगवान भी करते है। pic.twitter.com/ovMcsT9hmg
— Sanju_12 (@Sanju_manju1) July 16, 2026
