దగ్గరుండి పిల్లలకు వేట నేర్పిన పెద్దపులి..దున్నపోతు ఖతం
విధాత: అడవిలో సింహాలు, పులుల వంటి క్రూర మృగాల వేట ఎంత క్రూరంగా ఉంటాయో వాటి జీవనశైలిపై అవగాహన ఉన్నవారికి తెలిసిందే. పెద్ద పులులు అయితే తమ సంతానానికి చిన్నప్పుడే ప్రాణాపాయాలను తప్పించుకోవడంలో..ప్రత్యర్థి జంతువులపై దాడి చేయడంలో తర్ఫీదునిస్తుంటాయి. ముఖ్యంగా తన పిల్లలు సొంతంగా ఆహారం సంపాదించుకోవడంలో వేటాడం ఎలా అన్నదానిపై చిన్ననాటి నుంచే మెళకువలు నెర్పుతుంటాయి. అలాంటి ఘటన ఓ అడవిలో చోటుచేసుకుంది. ఓ పెద్దపులి తన మూడు పులి పిల్లలకు అడవి దున్నపోతును వేటాడంపై శిక్షణ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది.
రణతంబోర్ నేషన్ పార్కులో ఓ అడవి దున్నపోతును చుట్టుముట్టిన పెద్ద పులి, ముడు పులిపిల్లలు దానిపై దాడి చేస్తాయి. దున్నపోతును పులిపిల్లలు వేటాడుతుండగా..తల్లిపులి అక్కడే కూర్చుని వాటికి సూచనలిచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే ప్రాణ రక్షణలో భాగంగా దున్నపోతు పులి పిల్లలపై తిరగబడుతుంది. ఇలా కొద్ధిసేపు సాగక..పెద్దపులి దున్నపోతుపై పడి దానిని నోట కరిచి బంధిస్తుంది. పులి పిల్లలు సైతం దాడిలో తమవంతు పాత్ర నిర్వహిస్తాయి. ఇదంతా పెద్దపులి తన పిల్లలకు వేటలో శిక్షణనిచ్చే ఘట్టంలో భాగంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram