Tigers Fight | తగ్గేదేలే.. జింక కోసం రెండు పులుల మధ్య భీకర యుద్ధం..! వీడియో
Tigers Fight | ఇటు మానవ సమాజంలో కానీ, అటు జంతువుల సమూహంలో కానీ.. బలవంతులదే పై చేయి. ఏ సమూహంలోనైనా సరే బలవంతులు, బలహీనులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో బలహీనుల నోటి కాడి ముద్దను బలవంతులు లాక్కెళ్తుంటారు. ఇలాంటి ఘటనలు మానవ సమాజంలో చాలాసార్లు చూసే ఉంటాం. మరి జంతువుల సమూహంలోనూ అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక జింక కోసం రెండు పులులు భీకర యుద్ధం చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ […]
Tigers Fight | ఇటు మానవ సమాజంలో కానీ, అటు జంతువుల సమూహంలో కానీ.. బలవంతులదే పై చేయి. ఏ సమూహంలోనైనా సరే బలవంతులు, బలహీనులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో బలహీనుల నోటి కాడి ముద్దను బలవంతులు లాక్కెళ్తుంటారు.
ఇలాంటి ఘటనలు మానవ సమాజంలో చాలాసార్లు చూసే ఉంటాం. మరి జంతువుల సమూహంలోనూ అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక జింక కోసం రెండు పులులు భీకర యుద్ధం చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కులో ఓ జింక కళేబరం రోడ్డుపై కనిపించింది. జింక కళేబరం ఓ ఆడ పులి కంట పడింది. ఇక జింక గొంతును పట్టి.. పక్కనే చెట్ల పొదల్లోకి లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది.
కానీ అంతలోనే ఓ మగ పులి ప్రత్యక్షమైంది. తగ్గేదేలే అన్నట్లు రెండు పులులు హోరాహోరీగా ఫైటింగ్ కొనసాగించాయి. చివరకు ఆడ పులి నోటి కాడి ముద్దను మగ పులి లాక్కుంది. జింక కళేబరాన్ని మగ పులి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లింది. చేసేదేమీ లేక ఆడ పులి అటు నుంచి నిష్క్రమించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram