నాగార్జున సాగర్ డ్యాం నుంచి నీటి విడుదలకు సంబంధించి మరోసారి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కేఆర్ఏంబి అనుమతీ లేకుండానే అక్రమం కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు. కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతి, సమాచరం లేకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది.
ప్రతిగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కేఆర్ఎంబి అనుమతులు లేకుండానే.. ఇరు రాష్ట్రాల అధికారులు సాగర్ డ్యాం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల చేయడం వివాదస్పదంగా మారింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు విడుదల చేసినందునా..ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా నీటి వివాదం
కేఆర్ఎంబీ అనుమతి లేకుండా కాలువలకు నీటి విడుదల
కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు
ప్రతీగా ఎడమ కాలువకు సైతం నీటిని విడుదల చేసిన తెలంగాణ అధికారులు
నీటి విడుదలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం… pic.twitter.com/rChCw0gSKi
— Telugu Feed (@Telugufeedsite) August 26, 2026