Digital Bharat Fund | ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు

ఇప్పటిదాకా మొబైల్‌ ఫోన్‌ సంభాషణలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని 120 మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పుడు ఆ సౌకర్యాన్ని పొందబోతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ వారితో ఇకపై మొబైల్‌ ఫోన్‌లలో సంభాషించబోతున్నారు.

Digital Bharat Fund | ఏపీలో ఆ 120 గ్రామాలకు తొలిసారి మొబైల్ సర్వీసులు

ఇప్పటిదాకా మొబైల్‌ ఫోన్‌ సంభాషణలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని 120 మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పుడు ఆ సౌకర్యాన్ని పొందబోతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ వారితో ఇకపై మొబైల్‌ ఫోన్‌లలో సంభాషించబోతున్నారు. ఇప్పటి వరకు వారికి ఎలాంటి మొబైల్ ఫోన్ సౌకర్యం లేదు. డిజిటల్ భారత్ నిధి కార్యక్రమం క్రింద టెలికమ్యూనికేషన్ శాఖ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు అయ్యాయి. ఏడాది లోగా టవర్లను ఏర్పాటు చేసి ప్రజలు సంభాషించుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లోని 120 మారుమూల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ అనేదే లేదు. ప్రైవేటు టెలికం సర్వీసు ప్రొవైడర్స్ కూడా టవర్లను ఏర్పాటు చేయకపోవడంతో ఈ గ్రామాలు మొబైల్ వినియోగానికి దూరంగా ఉన్నాయి. మొత్తం 120 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ కల్పించేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ రూ.120కోట్లు మంజూరు చేసింది. ఒక్కో గ్రామంలో రూ.1 కోటి వెచ్చించి మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. వీళ్లందరినీ డిజిటల్ స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు వీలుగా టవర్ల ఏర్పాటు కోసం స్థలాల ఎంపిక చేసి, ఏడాది లోపు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. 120 గ్రామాలలో 4జీ సర్వీసులు అందే విధంగా ఆధునిక టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేస్తున్నది.