ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలపై రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 337 కేసులు నమోదు చేశాం
గత 3 నెలల్లో రూ.3.60 కోట్ల స్టాంపింగ్ ఫీజులు రూ.1.94 కోట్ల కాంపౌండింగ్ ఫీజులు వసూలు చేశాం గుడివాడ,విధాత : రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో తూనికలు, కొలతల శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 337 దుకాణాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. […]

- గత 3 నెలల్లో రూ.3.60 కోట్ల స్టాంపింగ్ ఫీజులు
- రూ.1.94 కోట్ల కాంపౌండింగ్ ఫీజులు వసూలు చేశాం
గుడివాడ,విధాత : రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో తూనికలు, కొలతల శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 337 దుకాణాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో తూనికలు, కొలతల శాఖ పనితీరుపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో గత మూడు నెలల కాలంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ. 3 కోట్ల 60 లక్షల 15 వేల 117 ల స్టాంపింగ్ ఫీజు వసూలైందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 12 లక్షల 70 వేల 700 లు, విజయనగరం జిల్లాలో రూ. 12 లక్షల 54 వేల 560 లు, విశాఖపట్నం జిల్లాలో రూ. 45 లక్షల 44 వేల 920 లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.44 లక్షల 62 వేల 890 లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 25 లక్షల 07 వేల 845 లు, కృష్ణాజిల్లాలో రూ. 43 లక్షల 34 వేల 066 లు, గుంటూరు జిల్లాలో రూ.34 లక్షల 53 వేల 250 లు, ప్రకాశం జిల్లాలో రూ.24 లక్షల 47 వేల 325 లు, నెల్లూరు జిల్లాలో రూ. 24 లక్షల 10 వేల 945 లు, చిత్తూరు జిల్లాలో రూ. 28 లక్షల 61 వేల 690 లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 14 లక్షల 59 వేల 790 లు, అనంతపురం జిల్లాలో రూ. 25 లక్షల 17 వేల 365 లు, కర్నూలు జిల్లాలో రూ. 22 లక్షల 89 వేల 771 ల స్టాంపింగ్ ఫీజులు వసూలయ్యాయన్నారు.
2021-22 ఆర్ధిక సంవత్సరంలో మూడు నెలల కాలంలో రూ. ఒక కోటి 94 లక్షల 62 వేల 200 ల కాంపౌండింగ్ ఫీజులు వసూలయ్యాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.12 లక్షల 17 వేల 200 లు, విజయనగరం జిల్లాలో రూ. 10 లక్షల 01 వేల 700 లు, విశాఖపట్నం జిల్లాలో రూ . 27 లక్షల 63 వేల 100 లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ. 16 లక్షల 31 వేల 500 లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 14 లక్షల 11 వేల 000 లు, కృష్ణాజిల్లాలో రూ.21 లక్షల 81 వేల 000 లు, గుంటూరు జిల్లాలో రూ .14 లక్షల 58 వేల 100 లు, ప్రకాశం జిల్లాలో రూ.14 లక్షల 83 వేల 000 లు, నెల్లూరు జిల్లాలో రూ. 8 లక్షల 33 వేల 000 లు, చిత్తూరు జిల్లాలో రూ.16 లక్షల 75 వేల 000 లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ.12 లక్షల 90 వేల 500 లు, అనంతపురం జిల్లాలో రూ.13 లక్షల 82 వేల 100 లు, కర్నూలు జిల్లాలో రూ.11 లక్షల 35 వేల 000 ల కాంపౌండింగ్ ఫీజులు వసూలయ్యాయని నాని తెలిపారు.