Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న జనసేన ఎమ్మెల్యేలు
Pawan Kalyan | జనసేన ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన జనసేన ఎమ్మెల్యేలు.. ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్‌ను తమ ఎల్పీ నాయకుడిగా ఎంపికచేసుకున్నారు. ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్‌ను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించగా.. మిగిలిన ఎమ్మెల్యేలు ఆ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన జనసేన ఎమ్మెల్యేలు.. ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్‌ను తమ ఎల్పీ నాయకుడిగా ఎంపికచేసుకున్నారు. ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్‌ను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించగా.. మిగిలిన ఎమ్మెల్యేలు ఆ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అద్భుత విజయం సాధించింది. ఎన్డీఏ కూటమితో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించారు. అయినాసరే మొత్తానికి మొత్తం స్థానాల్లో జనసేన విజయదుందుభి మోగించింది. 21 మంది ఎమ్మెల్యేలుగా, ఇద్దరు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఇవాళ జనసేన శాసనపక్షం సమావేశమై పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram