Ambati Rambabu : అంబటికి రిమాండ్ కష్టాలు..మరో కేసులో 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు. ఇప్పటివరకు 52 కేసులు నమోదైనట్టు సమాచారం.
అమరావతి : వైసీపీ నేత, మాజీ మంత్రి నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళన సందర్బంగా పోలీసుల విధులకు ఆటంకం కల్పించారన్న అభియోగాలతో నమోదైన కేసులో స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు అంబటికి 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్‌పై అంబటిని గుంటూరు కోర్టుకు పట్టాభిపురం పోలీసులు తీసుకొచ్చారు.
ఇప్పటికే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో రాజమండ్రి జైలులో అంబటి రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై అంబటి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ కొనసాగనుంది. ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు కావడం గమనార్హం. మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి :
అలర్ట్ టైమ్.. పుల్వామా దాడి వేళ పాక్ మరో ఉగ్ర కుట్ర!
Chandrababu : గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram