Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్

సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు. మూడు కేసుల్లోనూ ఊరట, త్వరలో విడుదల అవకాశం.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 18, 2026, 1:02 pm IST
Read Time: 3 mins
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్

అమరావతి : వైసీపీ మాజీ మంత్రి అంటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట దక్కింది. 2023 సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా అవినీతి కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అంబటి పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం, పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. అనంతరం అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంబటి రాంబాబు, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అంబటి రాంబాబుపై పోలీసులు మూడు పీటీ వారెంట్లు వేశారు. మూడు కేసుల్లోనూ అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. చంద్రబాబును దూషించిన కేసులో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసుతో పాటు సంక్రాంతి సంబరాల కేసులోనూ బెయిల్ వచ్చింది. అయితే పోలీసులు మరొక పీటీ వారెంట్ దాఖలు చేయకపోతే అంబటి రాంబాబు జైలు నుంచి నేడో రేపో విడుదలయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి :

Ibrahimpatnam Municipal Elections | ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై స్టే ఎత్తివేత
Wedding | మ‌రికాసేప‌ట్లో పెళ్లి.. అక్క‌డే అస‌లు ట్విస్ట్‌.. వ‌రుడు అస‌లు అబ్బాయే కాదు..