Ambati Rambabu : అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో విచారణ కొనసాగుతుండగా, ఈ నెల 26 వరకు జైలులోనే ఉండనున్నారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Feb 12, 2026, 6:44 pm IST
Read Time: 3 mins
Ambati Rambabu : అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

అమరావతి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల సందర్బంగా లక్కీడ్రా పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంబటిపై నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి అంబటికి 14రోజుల రిమాండ్ విధించారు. అంబటిపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అప్పట్లో ఈ కేసు నమోదైంది.ఈ కేసు విచారణ కోసం రాజమండ్రి జైలులో ఉన్న రాంబాబును పీటీ వారెంట్‌పై పోలీసులు గురువారం గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ నెల 26వరకు అంబటికి రిమాండ్ కొనసాగనుంది.

ఇప్పటికే రెండు కేసుల్లో అంబటికి బెయిల్ లభించినప్పటికి మూడో కేసులో రిమాండ్ తీర్పు రావడంతో అంబటి మరికొన్ని రోజులు జైలులోనో కొనసాగనున్నారు.

అయితే రిమాండ్ తీర్పు వెలువడిన వెంటనే అంబటి న్యాయవాదులు గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో బెయిల్ పిటిషన్ తో పాటు జైలులో వసతి కల్పనలపై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బెయిల్ వస్తేనే అంబటి జైలు నుంచి విడుదలవుతారు. మరోవైపు ఏపీ కూటమి ప్రభుత్వం అంబటిపై పెట్టిన 35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై విచారణను హైకోర్టు మార్చి 2కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Beach Landing in Mogadishu | బీచ్‌లో దిగిన విమానం… షాక్​లో ప్రయాణీకులు! – సోమాలియాలో అద్భుతం!
Viral Video | కూతురి బిడ్డ‌కోసం తాప‌త్రయం.. రైళ్ల‌లో ప‌ల్లీలు అమ్ముతూ.. వృద్ధురాలి క‌ష్టం చూడండి..