Viral Video | కూతురి బిడ్డకోసం తాపత్రయం.. రైళ్లలో పల్లీలు అమ్ముతూ.. వృద్ధురాలి కష్టం చూడండి..
మనవరాలి కోసం ఓ వృద్ధురాలు (elderly woman) రైల్లో పల్లీలు అమ్ముతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది (Viral Video).
Viral Video | సోషల్ మీడియా ఒక్కటి చాలు ప్రపంచంలో జరిగే వింతలన్నీ ఉన్నచోటు నుంచే చూడొచ్చు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యం ఎన్నో వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని స్ఫూర్తిని నింపేటివి ఉండగా.. మరికొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. తాజాగా స్ఫూర్తినిచ్చే వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో జీవిత పాఠాన్ని నేర్పిస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..?
ఓ వృద్ధురాలు (elderly woman) రైల్లో తినుబండారాలు అమ్ముకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. వయసు మీదపడి, ఒంట్లో సత్తువ లేకపోయినా కుటుంబ పోషణ కోసం తపనపడుతోంది. రైళ్లలో పల్లీలు, ఇతర తినుబండారాలు అమ్ముతూ.. అందరికీ జీవిత పాఠాలు నేర్పుతోంది. నడుము ఒంగకపోయినా, చేతులు సహకరించకపోయినా.. తన మనవరాలి (granddaughter) కోసం ఎంతగానో కష్టపడుతోంది. ప్రతీ ప్యాసింజర్ వద్దకూ వెళ్లి వేరుశనగ కాయలు అమ్ముతోంది. వృద్ధురాలి పరిస్థితి చూసిన కొందరు.. ఈ వయసులో ఎందుకింత కష్టం..? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ జాలి చూపించారు. అయితే, ఆ బామ్మ చెప్పిన సమాధానం అందరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.
కూతురి బిడ్డకోసం తాపత్రయం
నా కూతురు చనిపోయింది. ఆ తర్వాత తొమ్మిది నెలల కూతుర్ని నా చేతిలో పెట్టి ఆమె భర్త కూడా ప్రాణాలు విడిచాడు. ఆ చిన్నారిని ఇన్నాళ్లు కష్టపడి పోషించాను. ఇప్పుడు 13 ఏండ్లు. ఇల్లు ఒక్కటి ఉంది. ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. ఆ ఇల్లు కూడా మా అమ్మ వాళ్లు కట్టించింది. నేను పోతే ఆ పాప అనాథ అవుతుంది. ఆ ఇల్లు తప్ప తనకు ఏమీ లేదు. అమ్మాయిని డిగ్రీ వరకైనా చదివించాలి కద. నేను ఇంట్లో కూర్చుంటే డబ్బు కష్టమవుతుంది. పాపను చదివించి ప్రయోజకురాలిని చేయాలంటే ఇలా అమ్ముకోక తప్పదు కద. ఈ వ్యాపారం ద్వారా అన్ని ఖర్చులూ పోను రూ.200 మిగులుతాయి. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కష్టాన్ని చూసి రైల్లో వాళ్లు చలించిపోయారు.
అలాంటి వారికి ఈ బామ్మే నిదర్శనం..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో కష్టాలు రాగానే కుంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారిని ఈ బామ్మ ఓ నిలువెత్తు నిదర్శనం అంటూ మాట్లాడుకుంటున్నారు. వయసు భారమైనా, కండబలం లేకపోయినా కుటుంబం కోసం ఆమె పడుతున్న తపన ప్రశంసనీయం అని మెచ్చుకుంటున్నారు.
జీవితంలో కష్టాలు రాగానే కుంగిపోయి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారికి ఈ బామ్మ ఓ నిలువెత్తు నిదర్శనం. వయసు భారమైనా, కండబలం లేకపోయినా కుటుంబం కోసం ఆమె పడుతున్న తపన ప్రశంసనీయం. కిక్కిరిసిన రైళ్లలో తినుబండారాలు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తోంది. “నా వల్ల కావడం లేదు” అనే వారికి ఈ… pic.twitter.com/GodF9frpYc
— ChotaNews App (@ChotaNewsApp) February 12, 2026
ఇవి కూడా చదవండి :
Shanghai Massive Sinkhole | క్షణాల్లో కుంగిన భూమి.. జనం పరుగో పరుగు: చైన్నై షాంఘైలో ఘటన
Egg Yolk | గుడ్డు పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram