Shanghai Massive Sinkhole | క్షణాల్లో కుంగిన భూమి.. జనం పరుగో పరుగు: చైన్నై షాంఘైలో ఘటన

షాంఘైలో మెట్రో పనుల సమయంలో రహదారి క్షణాల్లో కుంగి భారీ సింక్‌హోల్‌గా మారింది. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఘటన వీడియో వైరల్.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Feb 12, 2026, 4:17 pm IST
Read Time: 3 mins
Shanghai Massive Sinkhole | క్షణాల్లో కుంగిన భూమి.. జనం పరుగో పరుగు: చైన్నై షాంఘైలో ఘటన

విధాత : కళ్ల ముందు నిలుచున్న చోట భూమి కుంగిపోతే ఎంత భయానకంగా ఉంటుందో చైనా షాంఘై వాసులకు అనుభవంలోకి వచ్చింది. అకస్మాత్తుగా క్షణాల వ్యవధిలో భూమి భారీగా గొయ్యి మాదిరిగా కుంగిపోవడంతో అక్కడున్న జనం ప్రాణభీతితో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

చైనాలోని షాంఘై నగరం భారీ సింక్‌హోల్‌తో వణికిపోయింది. మిన్‌హాంగ్ జిల్లాలో మెట్రో పనులు జరుగుతుండగా.. ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యిలా మారింది. భూమి భారీ గొయ్యి మాదిరిగా కుంగిపోతుండగా..ఎంతలోతుకు కుంగిపోతుందో అర్ధం కాక..అంతకంతకు పెరిగిపోతున్న గొయ్యికి దూరంగా స్థానికులు పరుగు తీశారు. భూగర్భ పనుల్లో తలెత్తిన లోపమే ఈ భారీ సింక్ హోల్ కు కారణమని భావిస్తున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వగా..ఈ వీడియో నెట్టింటా వైరల్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయానక ఘటనపై షాంఘై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Pawan – Balayya | పిక్చ‌ర్ అదిరింది .. అసెంబ్లీలో పవన్ కల్యాణ్- బాలకృష్ణ భేటీ.. రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశం
Sushmita Konidela | మెగా డాట‌ర్ సుస్మిత కొణిదెల ప్రస్థానం ఏంటి .. ఆమె భ‌ర్త బ్యాక్‌గ్రౌండ్ ఇది..!