Chandrababu | 28 ఏండ్ల‌కే ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్ర‌బాబు.. సీబీఎన్ రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదీ..

Chandrababu | టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాలుగో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. చంద్ర‌బాబు చేత‌ ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌మాణం చేయించారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ న‌జీర్.. చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Chandrababu | 28 ఏండ్ల‌కే ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్ర‌బాబు.. సీబీఎన్ రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదీ..

Chandrababu | అమ‌రావ‌తి : టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాలుగో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. చంద్ర‌బాబు చేత‌ ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌మాణం చేయించారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ న‌జీర్.. చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే చంద్ర‌బాబు 28 ఏండ్ల‌కే ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 30 ఏండ్ల‌కే మంత్రి ప‌ద‌వి వ‌రించింది. 14 ఏండ్లు ముఖ్య‌మంత్రిగా, 15 ఏండ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు.

చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానం..

1975లో యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అప్పుడు చంద్ర‌బాబు వ‌య‌సు కేవ‌లం 28 ఏండ్లు. 1980లో అంజ‌య్య కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు. 1983లో ఎమ్మెల్యేగా చంద్ర‌గిరిలో ఓట‌మి పాల‌య్యారు. 1980-83 మ‌ధ్య కాలంలో పురావ‌స్తు, సినిమాటోగ్ర‌ఫీ, సాంకేతిక విద్య‌, ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి పరిశ్ర‌మాభివృద్ధి, చిన్న‌నీటి పారుద‌ల వంటి శాఖ‌ల్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హించారు. 1986లో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌య్యారు. 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ స‌మ‌న్వ‌యక‌ర్త‌గా కూడా నియామ‌కం అయ్యారు. 1995లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా పద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా ఎన్నిక‌య్యారు. 1999లో జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర పోషించారు. 1999లో ఉమ్మ‌డి ఏపీకి రెండోసారి సీఎంగా ఎన్నిక‌య్యారు. 2003లో అలిపిరి వ‌ద్ద క్లెమోర్ మైన్ల‌తో మావోయిస్టులు దాడి చేశారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా కొన‌సాగారు. 2014లో న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2019 నుంచి 2024 వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నేత‌గా కొన‌సాగారు. 2024లో న‌వ్యాంధ్ర‌కు రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు.