Andhra Pradesh : ఏపీలో మళ్లీ వెలుగు చూసిన ఉగ్ర లింక్ లు..ఇద్దరి అరెస్టు!
ఏపీలో మరోసారి ఉగ్ర లింక్ కలకలం! ధర్మవరం హోటల్ వంట మనిషి సహా ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ లింక్‌లపై దర్యాప్తు.
Andhra Pradesh | అమరావతి : ఆంధ్రప్రదేశ్‌తో ఉగ్ర లింక్‌లు వరుసగా బయటపడుతూ కలకలం రేపుతున్నాయి. శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాది జాడ సంచలనం రేపింది. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ మహ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బిర్యానీ హోటల్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ను ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. ధర్మవరం పట్టణంలోని లోనికోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.. నూర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. నూర్ మహ్మద్ తరుచు పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు.
నూర్ ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే పోలీసులు ఎర్రగుంట ప్రాంతానికి చెందిన యువకుడు రియాజ్ ను కూడా అరెస్టు చేశారు. అతను పాకిస్తాన్ జెండాతో పాటు ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియో అప్ లోడ్ చేసినట్లుగా గుర్తించారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ఏపీలో ఉగ్రవాదుల జాడలు వరుసగా వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. మొదట విజయనగరం.. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల లింక్‌లు వెలుగు చూశాయి. .రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని అరెస్ట్ చేసిన ఐబీ అధికారులు.. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram