Peddi | ‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ .. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఫుల్ హైప్
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ పై పూర్తి దృష్టి పెట్టారు. స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు సాన అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ పై పూర్తి దృష్టి పెట్టారు. స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు సాన అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సందర్భంగా షూటింగ్‌కు స్వల్ప విరామం తీసుకున్న రామ్ చరణ్, కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. అయితే పండుగ హడావుడి ముగిసిన వెంటనే మళ్లీ పనిలోకి దిగిన చరణ్, రాబోయే కీలక షెడ్యూల్ కోసం తన శరీరాన్ని మరింతగా సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
‘పెద్ది’ కోసం చరణ్ పూర్తిగా కొత్త లుక్‌ను సెట్ చేసుకున్నారని ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఫిజిక్, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఈ పాత్రకు తగ్గట్లుగా మార్చుకున్నారని ఆ ఫోటోలే చెబుతున్నాయి. సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన షెడ్యూల్ మరింత టఫ్‌గా ఉండటంతో, చరణ్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ చివరి దశకు చేరుతుండగా, మరోవైపు సినిమాకు సంబంధించిన పాటలు ప్రపంచవ్యాప్తంగా హవా చూపిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘చికీరి చికీరి’ సాంగ్ అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే 200 మిలియన్ల వ్యూస్‌ను దాటడం విశేషం. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ పాట విపరీతంగా వినిపిస్తుండటంతో, సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్, రెహమాన్ మ్యూజిక్ కలిసి సినిమాకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. మేకర్స్ ప్లాన్ ప్రకారం మార్చి 27న ‘పెద్ది’ను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ మీట్‌తో మెగా ఫ్యాన్స్‌లో జోష్ పెరిగితే, ఇప్పుడు రామ్ చరణ్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో మరో లెవల్ హైప్ క్రియేట్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషన్స్ మొదలైతే, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram