Peddi | పెద్ది నాన్-థియేట్రికల్ బిజినెస్ జోరు… చ‌ర‌ణ్ రేంజ్‌కి ఈ మాత్ర‌మేనా అంటున్న ఫ్యాన్స్

Peddi | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ త్వరలో “పెద్ది” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బుచ్చిబాబు స‌న‌ దర్శకత్వంలో మాస్ రూరల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

  • By: sn |    movies |    Published on : Feb 19, 2026 3:23 PM IST
Peddi | పెద్ది నాన్-థియేట్రికల్ బిజినెస్ జోరు… చ‌ర‌ణ్ రేంజ్‌కి ఈ మాత్ర‌మేనా అంటున్న ఫ్యాన్స్

Peddi | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ త్వరలో “పెద్ది” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బుచ్చిబాబు స‌న‌ దర్శకత్వంలో మాస్ రూరల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. గ్రామీణ నేపథ్యంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఓటీటీ, ఆడియో హక్కులు భారీ ధరలకు

తాజాగా “పెద్ది” సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఓటీటీ హక్కులు దాదాపు రూ.115 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్ రూ.18 కోట్లకు క్లోజ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ రెండు ఒప్పందాలే పూర్తి కాగా, శాటిలైట్, హిందీ శాటిలైట్, హిందీ డబ్బింగ్ డిజిటల్ హక్కులు ఇంకా అమ్మాల్సి ఉన్నాయి. అవి కూడా క్లోజ్ అయితే మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ.170 కోట్లకు పైగా చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బడ్జెట్, థియేట్రికల్ డిమాండ్

“పెద్ది” చిత్రానికి సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. భారీ సెట్లు, యాక్షన్ సీక్వెన్సులు, గ్రామీణ నేపథ్యంతో ఉన్న కథ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. థియేట్రికల్ డిమాండ్ కూడా గట్టిగానే ఉందని ట్రేడ్ టాక్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నందున కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం చరణ్ రేంజ్‌కి నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇంకా ఎక్కువగా ఉండాల్సిందని భావిస్తున్నారు. అయినప్పటికీ రిలీజ్‌కు ముందు ఉన్న ఈ బిజినెస్ ఫిగర్స్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. మొత్తానికి “పెద్ది” విడుదలకు ముందే వాణిజ్యపరంగా బలమైన స్టార్ట్ తీసుకుంది. ఇక థియేటర్లలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.